నాలోని భావాలే నా సినిమాలు: పవన్ కళ్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కాటమరాయుడు`.శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా.....
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ - ``అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను సినిమాల్లోకి టెక్నిషియన్ అవుదామకుని వచ్చాను. కానీ హీరోను అయ్యాను. అయితే ఏ పని ఇచ్చినా అది తోట పనైనా, వీధులు ఊడ్చే పనైనా ఏదైనా కావచ్చు. నిజాయితీగానే చేస్తా. సినిమాలు నాకు భగవంతుడు పెట్టిన భిక్షగా భావిస్తాను. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుని పనిచేస్తాను. ఇక ఫలితం ఆ భగంతుడికే వదిలేస్తాను. నేను చేసిన సినిమాలన్నీ అనుకోకుండా వచ్చినవే. ప్రతి సినిమాలో ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. ప్రేమ గొప్పదని గోకుంలంలో సీత సినిమాలో చెప్పాను. ఇక సుస్వాగతం సినిమా క్లైమాక్స్ చేసేటప్పుడు నేను నలభై టేక్స్ తీసుకుని నిజంగానే ఏడ్చేస్తూ ఆ సినిమా చేశాను. నిజంగానే నా తండ్రి చనిపోయిననప్పుడు కూడా ఏడ్వలేనేమో అనేలా ఏడ్చాను. అయితే జల్సా సమయంలో నా తండ్రి చనిపోతే కూడా నేను ఏడవలేదు. ఇక తొలిప్రేమలో బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అని చెప్పాను. ఇలా నాలోని భావాలు సినిమాలుగా వచ్చాయి.
ఇక తమ్ముడు సినిమా కోసం నా ప్రాణాలను పణంగా పెట్టి ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్‌ను మళ్ళీ నేర్చుకున్నాను. మన రాతలను రాసేది మనమే అని యూత్‌కు చెప్పడానికి చేసిన సినిమా తమ్ముడు. బద్రి సినిమాలో నా విలన్‌తో నేను చెప్పే డైలాగ్ ..నువ్వు నంద అయితే నేను బద్రి ..బద్రినాథ్..ఈ డైలాగ్ చెప్పడానికి కారణం..ప్రతి ఒక్కరూ రక్తమాంసాలున్న మనుషులే అని చెప్పడానికే. ఇక ఖుషీ మూవీలో మన దేశాన్ని, మన ప్రాంతాన్ని ప్రేమించాలని చెప్పాను. ఇక సినిమాల్లో అన్నయ్య చిరంజీవి నా హీరో. సుస్వాగతం సభకు నన్ను ఊరేగింపుగా తీసుకెళతామని చెబితే భయపడ్డాను. అందరి ప్రేమ చూసి భయమేసింది. అందరికీ రెండు చెతులేత్తి దండం పెట్టాను. ప్పుడు నా తండ్రి మాటలు గుర్తొచ్చాయి. ఈ సృష్టిలో అందరూ ఒక్కటే` అనే మాటలు నాలో ప్రతి ధ్వనించాయి. నన్ను అభిమానించే ప్రతీ ఒక్కరికీ నేను శిరస్సు వచ్చి మోకరిల్లుతాను.ఇవాళ ఒక మంచి ఆలోచనతో సినిమా ఈ తీశాం. మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరిస్తా. శరత్‌మరార్ మంచి మిత్రుడు ఆయన కోసమే ఈ సినిమా చేశా. డాలీ చాలా సున్నితమైన దర్శకుడు. నా జీవితంలో ఎప్పటికీ తమ్ముడినే. ఈ సినిమా పాత్ర ప్రకారం తొలిసారి అన్నయ్యను అయ్యాను`` అన్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``నేను, పవన్‌కళ్యాణ్‌గారు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఎవడో ఒకడు వస్తాడు..న్యాయం చేస్తాడనుకుని జీవించే వారిని చూస్తే నాకు గర్వం ఉండదని పవన్ కల్యాణ్ గారు నాతో అంటుంటారు. ఒక వ్యక్తి చేయి ఎత్తగానే జనం ఆగిపోయే శక్తి కోట్లలో కొంతమందికి మాత్రమే దేవుడు ఇస్తాడు. అలాగే చేయి చూపగానే ఆలోచించకుండా వెళ్ళిపోయే శక్తి కూడా దేవుడు కోట్లలో ఒకరికే దేవుడు ఇస్తాడు. ఆయనెవరనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మర్రి చెట్టు వేసవిలో ఎండ, వానకాలంలో వాన, చలికాలం చలి నుండి రక్షణ ఇస్తుంది. కానీ నన్ను గుర్తించమని ఎప్పుడూ కోరదు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నా సినిమాలోని పాటను ఈ సినిమా టైటిల్‌గా పెట్టడం సంతోషంగా ఉంది. ఆయన అందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పొగరు జెండా అంతా ఉన్నంతగా ఉంటుంది. ఆయన గొంతుక కొన్ని కోట్ల మందిది. ఆయన అడుగు కొన్ని కోట్ల మందితో కలిసి నడిచే అడుగు. ఆయన ప్రేమ మీ అందరి అభిమానం ముందుకు రావాలని, అది సేవగా మారాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
చిత్ర దర్శకుడు కిషోర్ పార్థసాని మాట్లాడుతూ - ``ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే నేనే ఈ సినిమాను డైరెక్ట్ చేశానా అని అనిపిస్తుంది. గోపాల గోపాల సమయంలోనే నాతో మరో సినిమా చేస్తానని పవన్‌కళ్యాణ్‌గారు మాటిచ్చారు. అన్నమాట ప్రకారమే నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయనతో మరో ఐదారు సినిమాలు చేస్తే బావుంటుంది. నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చినందుకు పవన్‌గారికి థాంక్స్`` అన్నారు.
నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ - ``ఈ సినిమాకు అసలు నాయకుడు మన కాటమరాయుడు పవన్ కళ్యాణ్‌గారే. పంచె కట్టులో పవన్ ఎంతో అందంగా ఉన్నారు. ఈ సినిమా చేయాలనుకుకోగానే అన్నీ మంచి పరిణామాలు జరిగాయి. అందరూ సినిమా కోసం బాగా కష్టపడ్డారు`` అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - ``పవన్ కళ్యాణ్ గారితో గోపాల గోపాల సినిమా తర్వాత మరో సినిమాగా ఈ కాటమరాయుడు సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్‌గారికి, దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ - ``పవన్ కళ్యాణ్‌గారు కళ..కళ కోసం కాదు..జాతి కోసం అని చెప్పిన బళ్ళారి రాఘవ వంటి వారని చెప్పానా, భారతరత్న అంబేద్కర్ వంటి వారని చెప్పనా, హిందూ ముస్లింలు మన దేశానికి రెండు కళ్ళు అని చెప్పిన సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పినా, కందరూరి వీరేశలింగం అని చెప్పనా, టిప్పుసుల్తాన్ అని చెప్పనా, సుభాష్ చంద్రబోస్ అని చెప్పనా, మై నేమ్ ఈజ్ బండ్లగణేష్..మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్`` అన్నారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ - ``ఈ సినిమాలోని పాటలను పవన్‌కళ్యాణ్‌గారి అభిమానులను దృష్టిలో పెట్టుకుని రాసినవే. అనూప్ ఎంతో మంచి సంగీతాన్నిచ్చారు. అవకాశం ఇచ్చిన పవన్‌గారికి, దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్, టీవీ 9 సీఈవో రవిప్రకాస్, ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి, అజయ్, కమల్ కామరాజు, శివ బాలాజీ, కృష్ణచైతన్య, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout