కాష్మోరా అంటూ అందరికీ షాక్ ఇచ్చిన కార్తీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కింగ్ నాగార్జున తో కలిసి ఊపిరి చిత్రంలో నటించిన తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని గోకుల్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంది. కాష్మోరా ఫస్ట్ లుక్ ను హీరో కార్తీ రిలీజ్ చేసారు.
ఈ ఫస్ట్ లుక్ లో కార్తీ గుండుతో యుద్ధం నేపధ్యంలో ఓ సైనికాధికారిలా కనిపించి షాక్ ఇచ్చాడనే చెప్పాలి. కార్తీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తుంది. తెలుగు, తమిళ లో రూపొందుతున్న ఈ విభిన్న కథా చిత్రాన్ని దీపావళీ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాష్మోరా ఫస్ట్ లుక్కే ఇంత డిఫరెంట్ గా ఉంటే...ఇక సినిమా ఎంత డిఫరెంట్ గా ఉండబోతుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments