బాహుబలి - కాష్మోరా కి ఉన్న తేడా అదే - కాష్మోరా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్
Monday, October 24, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అడ్వెంచర్, మ్యాజిక్, హర్రర్, కామెడీ కలిపి రూపొందించిన ఈ డిఫరెంట్ మూవీ కాష్మోరా దీపావళి కానుకగా ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా భారీ చిత్రం కాష్మోరా గురించి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ చెప్పిన ఇంట్రస్టింగ్ డీటైల్స్ మీకోసం..!
కాష్మోరా పిరియాడిక్ ఫిల్మ్ కాదు..!
కాష్మోరా టైటిల్...ట్రైలర్ చూసి ఇదేదో పిరియాడిక్ ఫిల్మ్ అనుకుంటున్నారు. కానీ...ఇది పిరియాడిక్ ఫిల్మ్ కాదు. 600, లేక 1000 సంవత్సరాల క్రితం నేపధ్యంలో జరిగే కథ. సినిమా. ఇదేదో సీరియస్ ఫిల్మ్ అనుకుంటారు కానీ కాదు. డిఫరెంట్ గా ఉండే ఫన్ ఫిల్మ్. పిరియాడిక్ ఎపిసోడ్ 30 నుంచి 35 నిమిషాలు ఉంటుంది. ఫాంటసీ ఎపిసోడ్ ఈ మూవీలో ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. హర్రర్, కామెడీ కలిసిన కంప్లీట్ ఎంటర్ టైనర్ ఇది. ఆడియోన్స్ బాగా ఎంజాయ్ ఫిల్మ్ ఇది.
హాలీవుడ్ ఫిల్మ్స్ రిఫరెన్స్..!
ఈ చిత్రంలోని వార్ సీన్స్, వార్ కాస్టూమ్స్, జ్యూయలరీ కోసం మా టీమ్ తో చాలా డిష్కసన్స్ జరిగాయి. హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి రిఫరెన్స్ కూడా తీసుకున్నాం. అయితే...ఆడియోన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కలర్, కాస్టూమ్స్ విషయంలో కాస్త లిబర్టీ తీసుకున్నా ఆర్కిటెక్చర్ విషయంలో మాత్రం అప్పట్లో మన దేశంలో ఎలా ఉండేదో అలానే చూపించాం. అయితే గ్రాండియర్ కోసం పిల్లర్స్ 150 నుంచి 200 అడుగులు ఉన్నట్టు చూపించాం.
19 భారీ సెట్స్..!
కాష్మోరా కోసం 19 భారీ సెట్స్ వేసాం. పెద్ద బిగ్ దర్బార్ సెట్ ను 120 - 240 ఫీట్ తో రూపొందించాం. ఈ సెట్ ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుంది. నయనతార పోషించిన ప్రిన్సెస్ క్యారెక్టర్ కోసం ఎక్కువ సెట్స్ డిజైన్ చేసాం. ఈ సెట్స్ లో సాంగ్, యాక్షన్, వెడ్డింగ్ సీన్స్ చిత్రీకరించాం. అలాగే అంతఃపురం, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ అలాగే 1200 ఫీట్ హై టవర్ సెట్ వేసాం. ఈ భారీ సెట్స్ అన్ని ఆడియోన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి.
అదే బాహుబలికి కాష్మోరాకి తేడా..!
బాహుబలి సినిమా ఒక బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది. బాహుబలి అనేది ఒక సామ్రాజ్యానికి సంబంధించిన కథ. కాష్మోరా సినిమాలో సామ్రాజ్యం అనేది ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే. అలాగే మాకు బాహుబలికి ఉన్నంత బడ్జెట్ లేదు. అయినప్పటికీ బాహుబలి సినిమాకి సమానంగా ఉండేలా కాష్మోరాను రూపొందించేందుకు మా టీమ్ అంతా కలిసి చాలా హార్డ్ వర్క్ చేసాం. డైరెక్టర్ గోకుల్ చాలా తెలివిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1200 ఫీట్ టవర్స్, 200 ఫీట్ పిల్లర్, 19 డిఫరెంట్ సెట్స్ ఈ సినిమా కోసం రూపొందించాం. ఈ డిఫరెంట్ మూవీ కాష్మోరా ఆడియోన్స్ కు ఒక థ్రిల్ కలిగిస్తుంది అని ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments