అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కరుణాకరన్
- IndiaGlitz, [Friday,April 13 2018]
సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమ కథ' (ప్రచారంలో ఉన్న పేరు). ఇందులో కేరళకుట్టి అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ పోషిస్తున్న పాత్ర పేరు 'తేజ్' అని తెలిసింది. సాధారణంగా.. కరుణాకరన్ తన సినిమాలో హీరోకి రియల్ నేమ్‌నే రీల్ నేమ్‌గా వాడేస్తూ ఉంటారు. గతంలో కూడా తన సినిమాల్లో ఇలాగే వాడుకున్నారు కరుణాకరన్.
ఆ వివరాల్లోకి వెళితే.. తొలినాళ్ళలో తెరకెక్కించిన సినిమాలను పక్కన పెడితే ('తొలిప్రేమ' నుంచి 'బాలు' వరకు).. ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ' నుంచి ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు కరుణాకరన్ ('ఉల్లాసంగా ఉత్సాహంగా'లో తప్ప). 'హ్యాపీ'లో అల్లు అర్జున్ పేరు 'బన్నీ' (అల్లు అర్జున్ పెట్ నేమ్) కాగా.. 'డార్లింగ్'లో ప్రభాస్ స్క్రీన్ పేరు కూడా 'ప్రభాస్' కావడం విశేషం.
అలాగే రెండు జన్మల నేపథ్యంలో తెరకెక్కిన 'ఎందుకంటే ప్రేమంట'లో కూడా గత జన్మలో రామ్ పాత్ర పేరు కృష్ణ కాగా.. ప్రస్తుత జన్మలో పాత్ర పేరు 'రామ్' కావడం గమనార్హం. ఇక 'చిన్నదాన నీ కోసం'లో 'నితిన్' పేరునే స్క్రీన్ పేరుగా వాడుకున్నారు. కెరీర్‌లో పది సినిమాలు చేయగా.. అందులో సగం సినిమాలలో.. హీరోలని వారి రియల్ నేమ్స్‌తోనే తెర పై చూపించారు ఈ యూత్‌ఫుల్ చిత్రాల డైరెక్టర్.