కార్తీ కెరీర్‌లో మరో మైలు రాయి.. బాలీవుడ్‌కు ‘ఖైదీ’
Send us your feedback to audioarticles@vaarta.com
యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ అందించారు. దీపావళి కానుకగా అక్టోబర్- 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. అంతేకాదు.. కార్తీ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైల్‌స్టోన్‌గా నిలిచింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మొదటి రోజే ఊహించిన దానికంటే డబుల్ కలెక్షన్లు రావడం విశేషమని చెప్పుకోవచ్చు. 2019లో తమిళ్‌లో బ్లాక్ బస్టర్ సినిమా ఇదే కావడం కార్తీకి గర్వకారణంగా భావించాడు!
కాగా.. ఏదైనా సినిమా ఒక భాషలో సక్సెస్ అయితే దాన్ని తమ భాషల్లోకి అనువధించుకుని రిలీజ్ చేసుకోవాలని బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు ముందుకొస్తుంటారు. ఇప్పుడు ‘ఖైదీ’ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కలిసి ముందుకొచ్చాయి. ఈ సినిమాను హిందీలో అనగా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నట్లు సదరు నిర్మాతలు ఓ ప్రకటన రూపంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ.. హీరోయిన్, పాటలు లేకుండా నడిచిన ఈ యాక్షన్ జోనర్ చిత్రం ‘ఖైదీ’ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని నిర్ణయించామన్నారు. బ్లాక్ బాస్టర్ అయిన కార్తీ ‘ఖైదీ’ రీమేక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సౌత్‌లో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ రీమేక్ చిత్రం పాన్ ఇండియా ఆడియాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
కాగా.. డ్రీమ్ వారియర్స్ కంపెనీ అనేది చెన్నైలో అతిపెద్దది. దీనికి ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఫౌండర్స్. ఈ కంపెనీ పలు తెలుగు , తమిళ చిత్రాలకు ప్రొడక్షన్ కూడా చేసింది. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అక్కర్లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout