కార్తికేయ హీరోగా 'గుణ 369'
- IndiaGlitz, [Friday,April 26 2019]
‘ఆర్ ఎక్స్ 100 ’ ఫేమ్ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రానికి 'గుణ 369' అనే పేరును ఖరారు చేశారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ '' ఇంతకు ముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. మళ్లీ ఈ నెల 29 నుంచి మే 15 వరకు మరో భారీ షెడ్యూల్ చేయబోతున్నాం. దాంతో ఒక సాంగ్ మినహా సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నాం. మా చిత్రంలో హీరో పేరు గుణ. '369' అంటే ఏంటనేది స్క్రీన్ మీదే చూడాలి. ఇటీవలే క్రొయేషియాలో 2 పాటలు తీశాం. ఔట్ పుట్ చాలా బాగా వస్తోంది'' అని అన్నారు.
నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ '' రియల్ లవ్ ఇన్సిడెంట్స్ తో బోయపాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ కథను అద్భుతంగా తయారు చేసుకున్నాడు. వినగానే చాలా ఇంప్రెస్ అయి వెంటనే ఓకే చెప్పేశాం. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జోనర్‌లో ఉంటుంది. కచ్చితంగా యువతరాన్ని ఉర్రూతలూగించే విధంగా ఉంటుంది. హీరో కార్తికేయ కేరక్టరైజేషన్ 'ఆర్ ఎక్స్ 100', 'హిప్పీ' కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది'' అని తెలిపారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ '' కొన్ని కథలు వినగానే నచ్చుతాయి. మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంటాయి. నలుగురితో పంచుకోవాలనిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన కథ అలాంటిదే. వినగానే నచ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్పటిదాకా తీసిన రషెస్ చూసుకున్నాం. ప్రతి ఫ్రేమూ రియలిస్టిక్‌గా వచ్చింది. రియలిస్టిక్ చిత్రమిది'' అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమెరామెన్: ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, ఫైట్స్ : రామకృష్ణ ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శివ మల్లాల.