Bhaje Vayu Vegam:కార్తికేయ 'భజే వాయు వేగం’ టీజర్ విడుదల చేసిన మెగాస్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యువహీరో కార్తికేయ తాజాగా నటిస్తు్న్న చిత్రం 'భజే వాయు వేగం’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రథన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా టీజర్ కట్ చేశారు. ఈ మూవీలో 'హ్యాపీడేస్' ఫేం రాహుల్ కూడా నటించడం విశేషం.
ఓ డ్రగ్స్ కేసులో ఇరుకున్న హీరో.. దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కథని అర్థమవుతోంది. ప్రతి ఒక్కడి జీవితంలో ఒకడు ఉంటాడు. వాడి కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాము. అలా నా జీవితంలో మా నాన్న.. అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. గతేడాది ‘బెదురులంక 2012’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తికేయ ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా మరో చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన బలగం, ఓం భీం బుష్, మంగళవారం చిత్రాలతో తకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తూ తాజాగా ప్రభాస్ టైటిల్‌తో ప్రేక్షకులరించేందుకు సిద్ధమయ్యాడు. తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. భార్యలతో ఇబ్బందులు పడే భర్తల కథే ఈ సినిమా స్టోరీ అని చెప్పుకొచ్చారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ‘డార్లింగ్’ అనే టైటిల్ పెట్టారు. ‘వై దిస్ కొలవెరి’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ కల్ట్ మూవీ ‘డార్లింగ్’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com