ప్రముఖ దర్శక నిర్మాత చేతుల మీదుగా 'కార్తిక' మూవీ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మచెందర్ నట్టల నిర్మాణంలో కొత్త పరశురామ్ దర్శకత్వంలో బేబి అవంతిక ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'కార్తిక'. విజయ్‌భాస్కర్‌రెడ్డి, ప్రియాంక శర్మ, సింధు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ యూనిట్ సభ్యుల సమక్షంలో విడుదల చేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు కొత్త పరశురామ్ మాట్లాడుతూ... ముందుగా మా చిత్ర పోస్టర్‌ను లాంఛ్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపుకుంటున్నాము. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మా హీరో విజయ్‌భాస్కర్‌రెడ్డి ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. కొత్తవాడైనా మా కథకు పూర్తి న్యాయం చేసాడు. ఈ చిత్రంతో మంచి హీరోగా గుర్తింపు పొందుతాడు. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తప్పకుండా మా టీమ్‌కి ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుంది అన్నారు.
నిర్మాత మచెందర్ నట్టల మాట్లాడుతూ... ముందుగా నాకు డైరెక్టర్ పరశురామ్ ఎలా చెప్పాడో అలానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలా గొప్పగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్‌భాస్కర్‌రెడ్డి హీరోగా, ప్రియాంక శర్మ, సింధు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తర్వాత మా టీమ్ మొత్తానికి మంచి పేరొస్తుందని భావిస్తున్నాను.
ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదలవ్వడం చాలా సంతోషంగా వుంది. ఈ పోస్టర్‌ను చూసిన వారు చాలా డిఫరెంట్‌గా వుందని, అద్భుతంగా వుందని చాలామంది చెపుతున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియోను, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.
ఈ చిత్రంలో విజయ్‌భాస్కర్‌రెడ్డి, ప్రియాంక శర్మ, సింధు, అజయ్‌ఘోష్, రూలర్ రఘు, అంబటి శ్రీను, మహేష్ విట్టా, బేబి వెన్నెల, ప్రీతి, ప్రియ కోల, ప్రణహితనాయుడు, మౌనికా రెడ్డి, రామాంజనేయులు, మహేంద్ర, జ్యోతిరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: దేవరాజ్, నందు, రియల్ సతీష్, మేనేజర్: కుమార్, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ గౌడ్, డి.ఓ.పి.: వల్లి ఎస్కె, పి.ఆర్.ఓ: బాబు నాయక్, సంగీతం: సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: మహేంద్రనాథ్, డైలాగ్స్: చింత శ్రీను, నిర్మాత: మచెందర్ నట్టల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొత్త పరశురామ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com