"కార్తీక దీపం" దీప ఈజ్ బ్యాక్
Send us your feedback to audioarticles@vaarta.com
"కార్తీక దీపం".. స్టార్ మా లోనే కాదు.. తెలుగు టెలివిజన్ లోనే ఒక పెద్ద సంచలనం. ప్రతి తెలుగు ఇంటినీ, ప్రతి గుండెనీ తట్టి ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన ధారావాహిక. రేటింగ్స్ విషయంలో దేశం మొత్తం మీద ఎన్నో ప్రత్యేకతలు వున్న సీరియల్. ఈ సీరియల్ లో ప్రతి క్యారక్టర్ ఎంతో ప్రాధాన్యం వున్నదే. వారిలో దీప కోట్ల హృదయాలను గెలుచుకుంది.
ఎన్ని కష్టాలు పడ్డా ఒక మహిళ నిలదొక్కుకుని మళ్ళీ ఎలా నిలబడగలదో, తన ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోగలదో నిరూపించింది దీప. ఆమె ఇబ్బందుల్లో పడితే తట్టుకోలేక జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కష్టం నుంచి బయట పడితే స్వీట్లు పంచుకున్నారు. దీపకి మంచి జరగాలని బ్యానర్లు కట్టారు. భర్త తో ఆమె చల్లగా వుండాలని కొబ్బరికాయలు కొట్టారు.
ఒక విషాదం ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. దీపని ప్రేక్షకులకు దూరం చేసింది. ఆమె సీరియల్ లో లేకపోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద లోటు. ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. ఆ అందరి ఎదురుచూపులు నిజం చేస్తూ దీప మళ్ళీ "కార్తీక దీపం"లోకి అడుగు పెట్టింది.
"కార్తీక దీపం లోకి మళ్ళీ రావడం.. ప్రతి ఇంటినీ పలకరించడం చాలా సంతోషంగా ఉందని, నేను మళ్ళీ రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అంటోంది మనందరి అభిమాన దీప. ఇక "కార్తీక దీపం" సీరియల్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
"కార్తీక దీపం" ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Content Produced by: Indian Clicks, LLC
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments