Premi Viswanath : కార్తీకదీపంలో ‘నల్ల’ పిల్ల క్యారెక్టర్ వల్ల చిక్కులు.. అలర్జీ బారినపడ్డ వంటలక్క
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమి విశ్వనాథ్.. అంటే గుర్తుపట్టడం కష్టమే. అదే కార్తీక దీపం వంటలక్క అంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు టక్కున బుర్రలో లైట్ వెలుగుతుంది. కేరళకు చెందిన ప్రేమి.. కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు లొగిళ్లకు బాగా దగ్గరయ్యారు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కూతురు, కోడలు, భార్య, తల్లి , స్నేహితురాలు వుండాలన్నంత బాగా నటించి తెలుగింటికి ఆడపడుచుగా మారారు. సీరియల్లో ఈమె పడుతున్న కష్టాలు చూసి.. డాక్టర్ బాబుతో వంటలక్క కలవాలని, ఆమె సంసారం బాగుపడాలని ఎంతోమంది కోరుకున్నారు. అంతా చెరగని ముద్ర వేశారు ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ ప్రభావం కొన్నాళ్ల పాటు వుంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అనారోగ్యం బారినపడుతోన్న హీరోయిన్లు:
ఇదిలావుండగా.. ఇటీవల టాలీవుడ్ టూ కోలీవుడ్ ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా హీరోయిన్ల ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా పలువురు భామలు అనారోగ్యం బాధపడుతున్నారు. సమంత, పూనమ్ కౌర్, హంసా నందిని, మమతా మోహన్ దాస్ ఇలా చెప్పుకుంటే పోతే ఆ లిస్ట్ ఇక్కడితో ఆగదు. పలువురు అలనాటి హీరోయిన్లు కూడా తమ ఫలానా అనారోగ్యం బారినపడ్డామని చెబుతూ కన్నీటిపర్యంతమవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. గుండె సంబంధిత అనారోగ్యంతో తాను బాధపడుతున్నట్లు రేణూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తాజాగా ప్రేమి విశ్వనాథ్ కూడా స్కిన్ అలర్జీ బారినపడ్డారట.
నలుపు రంగు మేకప్‌తో ఇబ్బందులు పడ్డ ప్రేమి విశ్వనాథ్:
కార్తీక దీపంలో ప్రేమి పాత్ర ప్రకారం ఆమె నల్లగా వుంటుంది. స్వతహాగా ఎర్రగా వుండే ప్రేమి ఈ క్యారెక్టర్ కోసం నల్లగా కనిపించేందుకు స్పెషల్ మేకప్ వేయించుకోవాల్సి వచ్చింది. కొన్నేళ్ల పాటు ప్రతిరోజూ ఇదే తంతు నడవటంతో ప్రేమి అలర్జీకి గురయ్యారు. ఫేస్‌పై మచ్చలు, మొటిమలు కూడా వచ్చాయట. ఇది ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో స్కిన్ స్పెషలిస్ట్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు పూర్తి కోలుకున్నారట ప్రేమి విశ్వనాథ్. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకూ నిజం వుందో తెలియాలంటే వంటలక్కే స్వయంగా స్పందించాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout