అన్నయ్యని డైరెక్ట్ చేస్తానంటున్న తమ్ముడు

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

ఆవారా, నాపేరు శివ‌, ఊపిరి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు కార్తి. ఖాకి' సినిమా విజ‌యంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు ఈ యువ క‌థానాయ‌కుడు. ఈ సినిమా సక్సెస్ మీట్ సంద‌ర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నాడు కార్తి.

తన ఫస్ట్ ఫిలిం పరుతివీరన్'లో నటించక ముందు కార్తి.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొంతకాలం పనిచేసారు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన యువ' సినిమాకి కార్తినే అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో కార్తి సోదరుడు సూర్య కూడా ఒక హీరోగా నటించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ఆ రోజుల్లోనే తన డైరెక్షన్లో సూర్య కోసం ఒక స్క్రిప్ట్ అనుకున్నాడంట. కాని కొన్ని కారణాల వలన అది కార్యరూపం దాల్చలేకపోయింది. కాని ఏదో ఒక రోజు తన కల నిజమౌతుందని చెప్పాడు కార్తి.

ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు కార్తి. ఇది ఒక గ్రామీణ వాతావరణంలో సాగే ఎంటర్‌టైన‌ర్‌ ఫిలిం. ఈ మూవీలో సయేషా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

More News

గ‌రుడ‌వేగ ఆర్టిస్ట్‌.. షార్ట్ ఫిల్మ్‌

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నాడు యువ న‌టుడు ఆదర్శ్ బాలకృష్ణ.యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో రన్నర్ అప్ గా నిలిచాడు ఆద‌ర్శ్‌.

నాని 'ఎం సి ఎ' విడుదల తేదీ

డబుల్ హ్యాట్రిక్ హీరో.. నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు కాంబినేషన్లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు భానుమతిగా పరిచయమైన సాయిపల్లవి ఎం.సి.ఎలో హీరోయిన్గా నటించింది.

తెలుగులోకి మ‌రో హార‌ర్ చిత్రం..

తెలుగులో హార‌ర్ చిత్రాలు, హార‌ర్ కామెడీ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న త‌రుణంలో త‌మిళం నుండి తెలుగులోకి ఓ హార‌ర్ చిత్రం రానుంది. వ‌డివుడియాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'పొట్టు'.

భాస్క‌ర్‌కు మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తారా?

'బొమ్మ‌రిల్లు' సినిమాతో డైరెక్ట‌ర్ భాస్క‌ర్ పేరు మారు మోగిపోయింది. ఆ త‌ర్వాత భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'పరుగు' సినిమా కూడా మంచి విజ‌యాన్నే అందుకుంది.

మ‌ళ్లీ బిజీ అవుతున్న నిత్యా

నిత్యా మీన‌న్‌.. పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌లకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌క్షిణాది హీరోయిన్ పేరిది. సౌత్ లోని నాలుగు భాష‌ల్లోనూ న‌టిగా త‌న ప్ర‌తిభ‌ని చాటిన ఈ ముద్దుగుమ్మ‌.. తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.