యుక్రేయిన్కి కార్తి..
- IndiaGlitz, [Friday,July 13 2018]
శుక్రవారం విడుదలైన 'చినబాబు' చిత్రంతో సక్సెస్ సాధించాడు హీరో కార్తి. కుటుంబ కథా చిత్రంగా మంచి విజయాన్ని అందుకున్నాడు కార్తి. ఇప్పుడు తదుపరి సినిమా కోసం కార్తి సమాయత్తమవుతున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రజత్ దర్శకత్వంలో 'దేవ్' చిత్రంలో కార్తి నటిస్తున్నాడు.
కార్తి జతగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. 'ఆవారా' తరహా చిత్రంగా 'దేవ్' తెరకెక్కనుందట. ఖాకి చిత్రం తర్వాత కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ కలసి నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా కోసం కార్తి, రకుల్ యుక్రేయిన్కి వెళుతున్నారట. కొన్ని కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ చేస్తారని కోలీవుడ్ వర్గాల సమాచారం.