'కాష్మోరా' సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - కార్తీ
Send us your feedback to audioarticles@vaarta.com
కార్తీ హీరోగా పి.వి.పి సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్స్‌పై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన చిత్రం 'కాష్మోరా'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 28న విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. విడుదలైన మొదటివారంలోనే పదిహేను కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను సాధించి కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా హీరో కార్తీ పాత్రికేయ మిత్రులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. కార్తీ మాట్లాడుతూ -
ఉహించలేదు...
ఆడియెన్స్ నుండి ఇంత మంచి రెస్పాన్స్‌ను ఉహించలేదు. సోషియో ఫాంటసీ సినిమా, పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమా. రెగ్యులర్ కాన్సెప్ట్ మూవీ కాదు. హర్రర్‌కు కామెడినీ జోడించడంతో ఫస్టాఫ్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సెకండాఫ్‌లో హిస్టారికల్ పార్ట్, రాజ్‌నాయక్ క్యారెక్టర్‌ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. రెండున్నరేళ్ల ప్రయాణం. అందులో రాజ్‌నాయక్ క్యారెక్టర్‌కు తల లేకుండా ఉండేలా చూపించడం చిన్న విషయం కాదు. కథను ఉహించి చెప్పవచ్చు కానీ స్క్రీన్‌పై చూపంచే టప్పుడు చాలా శ్రమించాం. కానీ ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది. సినిమాను ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులకుకు థాంక్స్.
కంపేర్ చేసుకోలేదు...
బాహుబలి సినిమాకు కాష్మోరాకు కంపేర్ చేసుకోలేదు. బాహుబలి రిలీజ్ తర్వాత ఓ ట్రెండ్ క్రియేట్ చేయడంతో వార్ సీక్వెన్స్, సెట్స్ అన్నీ రీ వర్క్ చేసుకున్నాం. రెండూ ఇష్టమే... కాష్మోరా అనే క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించాం. స్టార్టింగ్‌లో కొంత సీరియస్‌గా ఉండే కాష్మోరా క్యారెక్టర్ తర్వాత కామెడితో కూడుకుని ఉండటం, అందరినీ మోసం చేసేలా ఉండటం వల్ల, అలాంటి కాష్మోరా క్యారెక్టర్ రాజ్‌నాయక్ భవంతిలోకి వెళ్లినప్పుడు బిహేవ్ చేసే స్టయిల్ హ్యుమర్‌తో కలిసి ఉండాలి. అలాగే రాజ్ నాయక్ క్యారెక్టర్ చేసేటప్పుడు గెటప్ చాలా కొత్తగా ఉండాలి, ఎవరూ ఇది కార్తీయే కదా అని వెంటనే గుర్తించకూడదు. ఆ క్యారెక్టర్ కాస్ట్యూమ్ నలభై కిలోలుంటుంది. దాన్ని వేసుకుని ఒకకవైపు విలనిజాన్ని చూపుతూనే తనెంటో తన హవభావాలతో భయపెట్టాలి. ఈ రెండు క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇంప్రవైజ్ చేశాం. దర్శకుడు మూడు క్యారెక్టర్‌ను తెరపై ప్రెజెంట్ చేసిన తీరు రియల్లీ సూపర్బ్. తనపై నమ్మకంతో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాను. ఆన్నయ్య మెచ్చుకున్నారు...
అన్నయ్య సూర్య ఆడియెన్స్ మధ్య సినిమా చూశారు. ఇంటర్వెల్ బ్లాక్‌లో అయితే బాగా నవ్వారు. ఈ మధ్య ఇంత బాగా నవ్వలేదురా అన్నారు. అలాగే సెకండాఫ్‌లో థ్రిల్ అయిపోయి సినిమాను చూశారు. సినిమా చూసిన తర్వాత యూనిట్‌ను అప్రిసియేట్ చేస్తూ ఓ పెద్ద లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హైలైట్స్...
సినిమా సక్సెస్‌లో విజువల్ గ్రాఫిక్స్ కీలకపాత్ర పోషించాయి. కుక్క హీరోను తరమడం, కింగ్‌డమ్ రూపొందించిన గ్రాఫిక్స్‌తో పాటు కాస్ట్యూమ్స్, ఇలా అన్ని చాలా బావున్నాయని అందరూ అప్రిసియేట్ చేశారు. సినిమా ఫస్టాఫ్‌ను ఇరవై రోజుల్లోపే షూట్ చేశాం. సెకండాఫ్‌ను షూట్ పూర్తి చేయడానికి ఏడాదిన్నర పైగానే పట్టింది.
బైలింగ్వువల్ అంత సులభం కాదు...
సినిమాను బైలింగ్వువల్‌లో చేయడం అనే మాట చెప్పడం సులభమే కానీ దాన్ని తెరకెక్కించేటప్పుడు చాలా కష్టపడాలి. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో మంచి రైటర్స్ అవసరం. మంచి రైటర్స్ ఉన్నప్పుడు సులభమవుతుంది. రెండింటికి వేరియేషన్స్‌ను కొత్తగా చూపించినప్పుడే చూసే ఆడియెన్స్‌కు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది.
విలన్‌గా చేయను...
పూర్తిస్థాయి విలన్‌గా చేయను. అన్నయ్య హీరో అయితే విలన్ చేయడానికి సిద్ధమే.
తదుపరిచిత్రం...
మణిరత్నంగారి దర్శకత్వంలో నా నెక్ట్స్ సినిమా ఉంటుంది. ఎనిమిది రోజుల చిత్రీకరణ మినహా సినిమా మొత్తం పూర్తయ్యింది. అందులో మిలటరీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను. మంచి లవ్ స్టోరీ. దీని తర్వాత ఓ పోలీస్ స్టోరీ చేయబోతున్నాను.
గోకుల్ మాట్లాడుతూ - '' సినిమా సక్సెస్ అవుతుందని భావించాను. కానీ చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఇంత బాగా ఆదరిస్తారని అనుకోలేదు. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్. ఈ సక్సెస్, ఇంకా మంచి సినిమాలు చేయాలనే బాధ్యతను పెంచింది. మూడు క్యారెక్టర్స్‌ను కార్తీ చాలా అద్భుతంగా పోషించారు. ఇంత మంచి నటుడుతో ఇంకా సినిమాలు చేయాలని భావిస్తున్నాను'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments