కార్తీ 'దేవ్' టీజర్ ఎలా ఉందంటే
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం "దేవ్". రజత్ రవి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు ప్రిన్స్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో కార్తీ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు.
టీజర్ విషయానికొస్తే "ఈ లోకం లో బతకడానికి ఎన్నో దార్లున్నాయి, ఎవరో చెప్పారని అర్ధం కానీ చదువు చదివి, ఇష్టం లేని ఉద్యోగం చేసి, ముక్కు మొహం తెలియని ఓ నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పని చేసి, ఈగో ,ప్రెజర్ కాంపిటేషన్ లో ఇరుక్కొని,అంటి అంటనట్టు లవ్ చేసి, ఏం జరుగుతుందో అర్ధం కాకుండా బతకడం ఓ దారి... కానీ ఇంకోదారుంది.
అంటూ కార్తీ చెబుతున్న డైలాగ్ తో మొదలైన ఈ టీజర్ లో బైక్ రేసింగ్ మరియు యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. రౌడీలు కార్తీని రౌండప్ చేసికొట్టడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు కార్తీ "నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతా.. 'మరి వదలకపోతే ' అనే రౌడీ పంచ్ కు "వదలకపోయిన తీసుకుపోతా" అంటూ కార్తీ వార్నింగ్ ఇచ్చే సీన్ అదిరిపోయింది. అలాగే టీజర్ చూస్తుంటే కార్తీ కి రకుల్ కి మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది.
హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బైక్ మరియు కార్ల ఛేజింగ్ లతో థ్రిల్ చేసే యాక్షన్ సన్నివేశాలు చిత్రంలో చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్ ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments