'ఖైదీ' కార్తీ అని పిలుస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది - సక్సెస్ మీట్ లో కార్తి

  • IndiaGlitz, [Wednesday,October 30 2019]

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖైదీ'. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌తో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రోజురోజుకు పెరుగుతున్న ప్రేక్షకాదరణతో ముఖ్యంగా మహిళా ప్రేక్షకాదరణతో ఆల్ సెంటర్స్ హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో బుధవారం సక్సెస్ మీట్ నిర్వహించారు...

యాంగ్రీ హీరో కార్తి మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్‌. సినిమాకు ఘన విజయాన్ని అందించారు. నన్ను ఇంతకముందు ఆవారా కార్తీ అనేవారు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళినా ఖైదీ కార్తీ అని పిలుస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. తమిళనాడు, కేరళ, వరల్డ్‌ వైడ్‌ సినిమాకు సేమ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పండగ ప్రతి ఒక్కరికీ ఇంపార్టెంట్‌. చాలా రోజుల తర్వాత పండక్కి నా సినిమా విడుదలైంది. హీరోయిన్‌, పాటలు లేకుండా పండగ సినిమా అంటారేంటి? అని ఎవరైనా అడుగుతారేమోనని అనుకున్నాం. సినిమా చూస్తే అందరికీ నచ్చుతుందనేది మా కాన్ఫిడెన్స్‌. ఈ రోజు ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందని చెబుతున్నారు. ‘ఖైదీ’ లో యాక్షన్‌ ఉంది. మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. కామెడీ ఉంది. తండ్రి, కుమార్తె మధ్య ఎమోషన్‌, సెంటిమెంట్‌ ఉన్నాయి. ఇటువంటి సినిమా, క్యారెక్టర్‌ నాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక పాప ఉండటంతో క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాను.

దర్శకుడు లోకేష్‌ తీసిన విధానం, రాసిన విధానం చాలా అద్భుతమని చెప్పాలి. ఒక పక్క లారీలో యాక్షన్‌ జరుగుతుంటుంది. మరో పక్క ఎస్పీ ఆఫీసులో ఇంకో విషయం జరుగుతుంటుంది. ప్రేక్షకులను ఒక్క నిమిషం కూడా చూపు తిప్పుకోనివ్వకుండా దర్శకుడు సినిమా తీశాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు. నాకు ఒక బామ్మ ఫోన్‌ చేశారు. వీడియోలో రివ్యూ చెప్పారు. మంచి సినిమా, గొప్ప సినిమా తీశానని ప్రశంసించారు. యాక్షన్‌ సినిమా బామ్మకు నచ్చింది. అదే నిజమైన సక్సెస్‌. ఈ కథను నా దగ్గరకు తీసుకువచ్చిన ఎస్‌.ఆర్‌. ప్రభుకు థ్యాంక్స్‌. ‘అన్నయ్యా... ఒక చిన్న కథ ఉంది. వినండి. ప్రయోగాత్మక సినిమా’ అని అతను అన్నాడు. కథ విని ‘అరే... ఇది చిన్న సినిమా కాదు. చాలా పెద్ద సినిమా’ అన్నాను. కథ విన్నాక ఇంగ్లిష్‌ సినిమాలా తీయాలనుకున్నాం. తీశాం. ప్రేక్షకులు ఆ మాట చెబుతుంటే సంతోషంగా ఉంది. క్లైమాక్స్‌లో గన్‌ పట్టుకుని వస్తుంటే ‘హ్యాపీ దీపావళి’ అని థియేటర్లలో ఆడియన్స్‌ అరుస్తున్నారు. ‘ఖైదీ’ టైటిల్‌ పెడితే సినిమా హిట్‌ అనే సెంటిమెంట్‌ మరోసారి వర్కవుట్‌ అయ్యింది. తెలుగులో బెస్ట్ రిలీజ్ ఇచ్చిన సత్యసాయి ఆర్ట్స్ రాధామోహన్ గారికి థ్యాంక్స్. మా అన్నయ్య సూర్యగారు రెండుసార్లు సినిమా చూశారు. చాలా బావుందని మెచ్చుకున్నారు. రవితేజగారు ఫోన్‌ చేశారు. ‘ఇటువంటి సినిమా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పారు. ప్రేక్షకులు ఆదిరిస్తే ఇటువంటి సినిమాలు మరిన్ని చేయగలం. ‘ఖైదీ 2’ కూడా ఉంటుంది. ‘30 రోజులు డేట్స్‌ ఇస్తే తీస్తాం’ అని ప్రభు అడిగాడు. ఈసారి నైట్స్‌ కాకుండా డేలో తీయమని అడిగా. తప్పకుండా ‘ఖైదీ 2’ ఉంటుంది’’ అని అన్నారు.

సమర్పకులు, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత  కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ ‘‘ఈ దీపావళికి ‘ఖైదీ’ వెలుగులు నింపింది. మాకు సినిమాపై మొదటినుండి కాన్ఫిడెన్స్‌ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోననే అనుమానం ఉండేది. సాంగ్స్‌, హీరోయిన్‌ లేవు కనుక. అయితే, సినిమాకు అన్ని ఏరియాల నుండి రెస్పాన్స్‌ బావుంది. పాజిటివ్‌ టాక్‌తో థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. మల్టీప్లెక్స్‌లో రెండు మూడు షోలు పెంచుతున్నారు. కార్తీగారు దర్శకుడు లోకేష్‌ కనగరాజును నమ్మి కొత్త తరహా సినిమా చేశారు. కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించింది. దీపావళికి ఫుల్‌ మీల్స్‌ లాంటి సినిమా ఇది. ప్రతి సీన్‌లో నెక్ట్స్‌ ఏం జరుగుతుందోనని ఉత్కంఠ రేకెత్తించే సినిమా. ఫాదర్‌–డాటర్‌ ఎమోషన్‌, సెంటిమెంట్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. చిన్న పిల్లలు, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా ‘ఖైదీ’. తెలుగులో సినిమా రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన ఎస్.ఆర్. ప్రభు గారికి థ్యాంక్స్’’ అని అన్నారు.

నిర్మాత, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్.ఆర్‌. ప్రభు మాట్లాడుతూ ‘‘ఖైదీ’కి భారీ సక్సెస్‌ అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌. కార్తి గారి నటనకు అద్భుత స్పందన లభిస్తోంది. తమిళంలోనూ సినిమా భారీ సక్సెస్ సాధించింది. న్యూ ఏజ్ సినిమా ఇది. ప్రేక్షకులు సినిమాను ఆదరించడంతో మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తెలుగులో సినిమాను విడుదల చేసిన రాధామోహన్ గారికి థ్యాంక్స్ అని అన్నారు.

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సి.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌, ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌, మాటలు: రాకేంద్ర మౌళి, తెలుగు రాష్ట్రాల్లో సమర్పణ : శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌, దర్శకత్వం: లోకేష్‌ కనకరాజ్‌.

More News

తొలిసారి అలాంటి పాత్ర‌లో అంజ‌లి

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో మాధ‌వ‌న్ షాలిని పాండే,

ల‌స్ట్ స్టోరీస్‌లో ఈషా రెబ్బా

తెలుగు హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ తెలుగు సినిమాల్లో అవ‌కాశాల కోసం ఈషా రెబ్బా ఎక్కువ‌గా ఎదురుచూడాల్సి వ‌స్తుంది.

'ఆవిరి' హార‌ర్ చిత్రం కాదు.. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్ - ర‌విబాబు

`అల్ల‌రి`, `న‌చ్చావులే`, `అన‌సూయ‌`, `అవును`, `అవును 2` ..వంటి ప‌లు చిత్రాల ద్వారా త‌న‌దైన మార్కుతో ద‌ర్శ‌కుడిగా ర‌విబాబు త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు .

అల్లు అర్జున్,  సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో,  క్రేజీ మూవీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించే క్రేజీ మూవీ బుధవారం (అక్టోబర్ 30న) ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

బతికుంటే గెలుస్తూనే ఉంటా.. చచ్చిపోతా: పేకాట ‘కింగ్’

చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బావాజీ అనే ప్లేయింగ్ కార్డ్స్‌లో కింగ్.. కంటిచూపుతోనే లాఘవం ప్రదర్శిస్తున్నాడు. జూదంలో లోపల, బయట