కార్తీ, సాయెషా సైగల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'చినబాబు'

  • IndiaGlitz, [Tuesday,July 17 2018]

పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య నిర్మించగా పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు.. సత్యరాజ్‌, సూరి, శత్రు ఇతర ప్రముఖ పాత్రలో నటించగా ఇమ్మాన్ సంగీతం అందించారు.

గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమానికి హీరో కార్తీ సాయేషా సైగల్, నిర్మాత మిర్యాల రవీందర్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.. ట్రాఫిక్ జాం కారణం గా కార్తీ , నిర్మాత మిర్యాల రవీందర్ ఆటో లో సక్సెస్ మీట్ కి వచ్చి ప్రేక్షకులను , అభిమానులను ఆశ్చర్యపరిచారు..

ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ.. ఈ సినిమా ఎంతో ప్రేమతో చేసిన సినిమా..పక్కా ఫామిలీ ఓరియెంటెడ్ సినిమా.. ఒక ఫామిలీ ఎన్ని ఇబ్బందులొచ్చినా కలిసిఉండాలనే చెప్పే సినిమా.. ఒక కుటుంబంలో మామయ్య ఎంత ఇంపార్టెంట్ అని చెప్పే సినిమా అని అన్నారు.. ముఖ్యంగా అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమను ఈ సినిమాలో చాలాబాగా చూపించారు.. నిజంగా ఈ సినిమా ని అందరు చాల బాగా ఎంజాయ్ చేసారు..

సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు సినిమాలోని కామెడీ సన్నివేశాలను చాలాబాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమాక్స్ లో ఏడుస్తూన్నారు కూడా.. ప్రతి ప్రేక్షకుడు ఎంతో సాటిస్ఫాయింగ్ గా బయటకి వస్తుండడం నాకు సంతోషంగా ఉంది.. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన వైస్ ప్రెసిడెంట్ గారు ఈ సినిమా చూసి ఇలాంటి సినిమా మన సమాజానికి తప్పకుండా అవసరమని అయన ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేశారు.

ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెప్తున్నాను .. ముఖ్యంగా డైరెక్టర్ గారికి చాల చాల థాంక్స్ చెప్తున్నాడు.. అలాగే మీడియా వారికి కూడా చాల థాంక్స్ చెప్తున్నాను.. చాలామంది సినిమా చూసి చాల బాగుందని చెప్పారు.. నిర్మాత రవీందర్ రెడ్డి గారికి చాల థాంక్స్.

ఈ సినిమా ఇక్కడ పెద్ద హిట్ అవడానికి మీకృషి కూడా ఉంది.. ఈ సినిమా హిట్ అయినందుకు చాల హ్యాపీ గా ఫీల్ అయ్యాను.. అన్నయ సూర్య ప్రొడ్యూసర్ గా వచ్చిన ఈ సినిమా ని అందరు ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ చాల పెద్ద థాంక్స్ అన్నారు..

ఈ సినిమా కథానాయిక సాయేషా సైగల్ మాట్లాడుతూ... ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాల హ్యాపీ గా ఉంది.. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు, నాకు ఇంత డిఫరెంట్ రోల్ ఇచ్చినందుకు కార్తీ సర్ కి పాండి రాజ్ సర్ కి చాల థాంక్స్.. నా కెరీర్ లో ఈ సినిమా నాకు డిఫరెంట్ మూవీ.. ఇప్పటి వరకు మీరు చుసిన నేను వేరు.. ఈ సినిమాలో మీరు చుసిన నేను వేరే.. ఈ సినిమాని ఇంతగా సపోర్ట్ చేసిన మీడియా కి , సినిమా వెళ్తున్న ప్రేక్షకులకు చాల థాంక్స్ అంటూ ముగించింది..

సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ....విడుదలైన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్ లతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.. అన్నిటికన్నా విశేషమేంటంటే ఈ సినిమా ని ప్రెస్ వాళ్లతో కలిసి చూసాము.. వాళ్ళు చాల బాగా ఎంజాయ్ చేశారు సినిమాని.. సెకండ్ హాఫ్ మొత్తం చాల ఇంట్రెస్ట్ తో చూసారు.. ఇంకా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు సినిమా చూసి బ్లెస్సింగ్స్ అందించారు. ఇంత బిజీ లో వారు చూడడమే కాకుండా సినిమా చూసి ట్వీట్ చేశారు.

రైతు కుటుంబంలో ఉండే ఇబ్బందులు, ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు, ఆప్యాయతలు వీటి గురించి అయన ట్వీట్ చేసి ఈ సినిమా తెలుగు నేటివిటీ కి చాల దగ్గరిగా ఉన్న తమిళ సినిమా ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి అని ట్వీట్ చేశారు. పర్సనల్ గా మీకు చాల థాంక్స్ చెప్తున్నాను సర్.. మీ విలువైన టైం ని మా సినిమాకి కేటాయించినందుకు.. ఈ సినిమాకి వెళ్లిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా బయటకి వచ్చినవారు లేరని అన్నారు..