తమన్నాని హింస పెట్టిన కార్తీ
Send us your feedback to audioarticles@vaarta.com
మిల్కీ బ్యూటీ తమన్నాని.. 'ఆవారా' కార్తీ హింస పెట్టాడా? అవుననే వినిపిస్తోంది కోలీవుడ్‌లో. అయితే ఇదేదో వ్యక్తిగతంగా అనుకునేరు. కానేకాదు. సినిమా కోసం మాత్రమే. 'పయ్యా' (ఆవారా), 'సిరుత్తై' (విక్రమార్కుడు రీమేక్) చిత్రాల కోసం జంటకట్టి.. ఆ రెండు చిత్రాలతో భారీ విజయాలను తమ ఖాతాలో వేసుకున్న ఈ జంట నుంచి వస్తున్న మూడో చిత్రం 'ఊపిరి'. తెలుగుతో పాటు తమిళంలోనూ 'తోళన్' పేరుతో తెరకెక్కింది ఈ సినిమా.
ఈ చిత్రం కోసం నాగార్జున పి.ఎ.గా తమన్నా కనిపించనుంది. అనుకోని పరిస్థితుల్లో వీల్ ఛైర్‌కి పరిమితమైన నాగ్‌కి.. కేర్‌టేకర్‌గా కార్తీ దర్శనమివ్వనున్నాడు. ఆద్యంతం హుషారుగా ఉండే కార్తీ పాత్ర.. అప్పుడప్పుడు తమన్నాని తన అల్లరి చేష్టలతో హింస పెడుతుందట. కేవలం నాగ్ కోసం తమన్నా వాటిని భరిస్తుంటుందట. ఆ తరువాత క్రమంగా కార్తీ ప్రేమలో పడుతుందట. ఇదీ కోలీవుడ్‌లో వినిపిస్తున్న 'ఊపిరి'కి సంబంధించి కార్తీ, తమన్నాల స్టోరీ. సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com