'సింగం-3' లో కార్తీ?
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య, హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం`, సింగం2` చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో ఈ హిట్ సీక్వెల్ గా ఎస్3`(సింగం 3) రూపొందుతుంది. అనుష్క, శృతిహాసన్ ఇందులో నటిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రంలో సూర్య తమ్ముడు కార్తీ గెస్ట్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. రెండు సీన్స్ సహా ఓ పాటలో కార్తీ కనిపిస్తాడని కోలీవుడ్ మీడియాలో ఓ వర్గం అంటుంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ నిజమైతే అన్నదమ్ములిద్దరూ కలిసి నటించే మొదటి చిత్రమిదే అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments