బాహుబలి రావడం ఒకరకంగా టెన్షన్ పెంచితే ఆవిధంగా హెల్ప్ అయ్యింది - కార్తీ
- IndiaGlitz, [Tuesday,October 25 2016]
తమిళ హీరో కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మించారు. అడ్వెంచర్, మ్యాజిక్, హర్రర్, కామెడీ కలిపి రూపొందించిన ఈ డిఫరెంట్ మూవీ కాష్మోరా దీపావళి కానుకగా ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ... చెన్నైలో ఈ మూవీ చూసాం. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం ఏర్పడింది. సోషల్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ఇది. అరుంధతి సినిమాలా కాష్మోరా థ్రిల్ కలిగిస్తుంది.ఈ సినిమాని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పండగకి ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది. ఈ చిత్రంలో 90 నిమిషాలు విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఆడియోన్స్ కు థ్రిల్ కలిగిస్తాయి. రేపు తెలుగు వెర్షెన్ సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ చిత్రాన్ని నైజాంలో 200 థియేటర్స్ లో తెలుగు రాష్ట్రాల్లో 600 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. తెలుగు, తమిళ్ వెర్షెన్స్ కలిపి ప్రపంచ వ్యాప్తంగా 2,000 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
హీరోయిన్ శ్రీదివ్య మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. అందరిలాగే ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు.
హీరో కార్తీ మాట్లాడుతూ... రెండు సంవత్సరాలు కష్టపడి ఈ మూవీ చేసాం. డైరెక్టర్ గోకుల్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్....టీమ్ అంతా ఈ మూవీ కోసం చాలా హార్డ్ వర్క్ చేసారు. మా కష్టానికి తగ్గట్టు అవుట్ పుట్ బాగా వచ్చింది. బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు మా సినిమాని రెండు నెలలు పాటు ఆపేసి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాం.ఎందుకంటే బాహుబలి అనేది బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. మేము ఏం చేసినా బాహుబలితో కంపేర్ చేస్తారు. అందుకని బాహుబలి చూసిన తర్వాత మా సినిమాలో చాలా మార్పులు చేసాం. అయితే...బాహుబలి వచ్చి ఒకరకంగా మాలో టెన్షన్ పెంచితే...బాహుబలికి వర్క్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ & గ్రాఫిక్స్ టీమే మా మూవీకి వర్క్ చేయడంతో మాకు కొంచెం వర్క్ ఈజీ అయ్యింది. ఈరకంగా బాహుబలి రావడం హెల్ప్ అయ్యింది.
ఇందులో హర్రర్, కామెడీ, సస్పెన్స్...ఇలా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి. దీపావళికి పండగకి కరెక్ట్ సినిమా ఇది. ఇలాంటి జోనర్ సినిమా హాలీవుడ్ లో కూడా రాలేదు. ఈ చిత్రంలో నయనతార, శ్రీదివ్య ఇద్దరు హీరోయిన్స్ఉన్నా రొమాన్స్ లేదు. 30 సినిమాలు చేసిన తర్వాత చేయాల్సిన సినిమాను నేను 12 సినిమాలు చేసిన టైమ్ లోనే రావడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఈనెల 27న మా నాన్న గారి పుట్టినరోజు. ఈ మూవీ బిగ్ సక్సెస్ సాధిస్తే నాన్నకు ఇచ్చే గిఫ్ట్ ఇదే అవుతుంది. అయితే..ఈ మూవీ నాకోసం కాదు మా డైరెక్టర్ గోకుల్ కోసం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ఆయన ఈ మూవీ పైనే వర్క్ చేసారు. నేను మధ్యలో ఊపిరి సినిమా చేసాను కానీ డైరెక్టర్ గోకుల్ వేరే సినిమా చేయకుండా ఈ సినిమాకే వర్క్ చేసారు.
మేకప్ వేసుకోవడానికే మూడున్నర గంటలు పట్టేది. దీంతో ఒక సీన్ కోసం ఐదు గంటల టైమ్ పట్టేది. రెండు క్యారెక్టర్స్ చేయడానికే ఇంత టైమ్ పడితే కమల్ హాసన్ గారు దశవతారంలో పది క్యారెక్టర్స్ ఎలా చేసారనిపించింది. కాష్మోర్ క్యారెక్టర్ కామెడీ చేస్తే...రాజ్ నాయక్ క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది. ఈ రెండు క్యారెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాయి. ఆ రెండు క్యారెక్టర్స్ ను ఓకే ఫ్రేమ్ లో చూసినప్పుడు ఆడియోన్స్ థ్రిల్ ఫీలవుతారు. ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తున్నప్పుడు ఆడియోన్స్ కు ఎన్టీఆర్ గారు, శివాజీగణేషన్ గుర్తుకువస్తారు. వాళ్లు గుర్తుకు రాకుండా చేయాలి ఎలా చేయాలి..? అని నాజర్ గార్ని అడిగాను. వాళ్లు గుర్తుకు రాకుండా చేయడం కష్టం అని చెప్పారు. అయినా...నావంతు ప్రయత్నం చేసాను. ఎలా చేసానో సినిమా చూసి ఆడియోన్స్ చెప్పాలి. బాహుబలి 2 లా మీరు కూడా కాష్మోరా 2 తీస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. కాష్మోరా బిగ్ హిట్ అయితే కాష్మోరా 2 చేస్తాం అన్నారు.