కార్తీ టైటిల్...

  • IndiaGlitz, [Saturday,November 12 2016]

కాష్మోరాతో స‌క్సెస్ అందుకున్న కార్తీ ఇప్పుడు మ‌ణిర‌త్నం సినిమా పూర్తి చేయ‌డంలో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ, అదితిరావు హైద‌రీ జంట‌గా మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ ల‌వ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కార్తీ ఓ ఫైల‌ట్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. సినిమా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ సినిమాను దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ సినిమాను మార్చిలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు బావిస్తున్నారు. ఈ సినిమాకు డ్యూయెట్‌, ఆకాశ‌దేశాన అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.