గ్రాండ్ రిలీజ్కి సిద్ధమైన కార్తి
Send us your feedback to audioarticles@vaarta.com
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఖాకి' నవంబర్ 17న విడుదలకు సిద్ధమైంది. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ నుండి విడుదల వరకు హ్యూజ్ రెస్పాన్స్ను రాబట్టుకున్న ఈ చిత్రం తమిళం సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ రేంజ్లో విడుదల కానుంది.
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కార్తి నటించిన ఈ చిత్రంలో రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన భారీ ఛేజింగులు ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమా కోసం కార్తి చాలా హార్డ్ వర్క్ చేశారు. పాత్ర కోసం బరువు తగ్గడం, పోలీస్ ఆకాడమీలో ట్రయినింగ్ తీసుకున్నారు. మట్టి నుండి లేచి పరిగెత్తి విలన్స్ను పట్టుకునే సన్నివేశం కార్తి సినిమా కోసం పడ్డ తపనను ఆవిష్కరిస్తుంది.
తొలి వయసే..సహా సాంగ్స్ సినిమాలోని రొమాంటిక్ పార్ట్ గురించి సూచిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో విభిన్నమైన పాత్రలో కనపడనుంది. ఇప్పటి వరకు కనిపించని పాత్రలో ప్రేక్షకులకు కనపడతానని అల్రెడి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. 'చతురంగ వేట్టై' వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు సినిమా భారీ రిలీజ్కు సిద్ధమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com