జోరుగా 'ఖాకి' ప్రమోషన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇవాళ్టి రోజుల్లో ప్రచారానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను కష్టపడి చేసిన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో హీరోలు చాలా ముందుంటున్నారు. అలాంటివారిలో ముందువరసలో ఉన్న హీరో కార్తి. ప్రతి చిత్రం విషయంలోనూ షూటింగ్లో ఎంత కష్టపడతారో, ప్రమోషన్స్ విషయంలోనూ అంతే కష్టపడతారు. ఆయనతో పాటు ఆయన టీమ్ కూడా ఆ స్పిరిట్‌ను అందుకుంటుంది.
తాజాగా `ఖాకి` ప్రమోషన్స్ లోనూ అంతే ఆసక్తికరంగా, హుషారుగా పాల్గొంటున్నారు కార్తి అండ్ టీమ్. కార్తి పోలీసాఫీసర్‌గా తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా `ఖాకి`. రకుల్ ప్రీత్‌సింగ్ ఇందులో ఆయనకు జోడీగా నటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాకు టీజర్, ట్రైలర్, మేకింగ్ వీడియో, ఆడియో అన్నీ పాజిటివ్ రెస్సాన్స్ తెచ్చిపెట్టాయి. దాంతో చిత్ర యూనిట్ ఇంకా జోరుగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవ ఘటనలతో తెరకెక్కిన చిత్రం కావడంతో మరింతగా ప్రేక్షకులకు చేరువైంది. దానికి తగ్గట్టే ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ ని చేస్తున్నారు. ఈ నెల 17న విడుదల కానున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com