సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా ప్రశంసలందుకుంటున్న 'ఖాకి'
Send us your feedback to audioarticles@vaarta.com
పోలీస్ చిత్రాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. ముఖ్యంగా విభిన్నమైన పోలీస్ కథనాలకు ప్రజలు నీరాజనం పడుతూనే ఉంటారనడానికి రీసెంట్గా విడుదలైన 'ఖాకి' చిత్రం. కార్తి, రకుల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ లిమిటెడ్ అధినేతలు ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తాలు.. నవంబర్ 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేశారు.
ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాల్లో ది బెస్ట్ పోలీస్ స్టోరీ అని అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. 1995-2005లో ఓ నిజమైన కేసును పోలీసులు ఎంత రిస్క్ చేసి సాల్వ్ చేశారనే దాని ఆధారంగా సినిమాను దర్శకుడు వినోద్ ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు.
సినిమా దోపీడీ దొంగలు ముఠా చేసే ఆగడాలను పోలీసు గుర్తించడమే కాకుండా వారిని వెంటాడే తీరు..వారిని అరెస్ట్ చేయడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుని వారిని వెంబడించడం..ఆ క్రమంలో వారి మధ్య జరిగే పోరాటాలు..ఛేజింగులు ప్రతిదీ ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్లో కూర్చొనబెట్టాయి. ఇంత రియల్ కాన్సెప్ట్ సినిమాలో సహజంగా నటించిన కార్తి నటనను అందరూ అభినందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com