భారీ బడ్జెట్‌తో కార్తి 'దేవ్'
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది విడుదలైన ‘ఖాకి’ (తమిళంలో ‘దీరన్ అధిగారం ఒండ్రు’) సినిమా మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయవంతమైన జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కార్తి, రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఈ జంట మరోసారి ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే.. నూతన దర్శకుడు రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ‘దేవ్’ అనే తమిళ సినిమా తెరకెక్కుతోంది. ఎడ్వెంచరస్ రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషించనుండగా.. ప్రకాష్ రాజ్, అమృత, రేణుక కీలక పాత్రల్లో నటించనున్నారు.
అలాగే.. నిన్నటితరం నటుడు కార్తిక్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. రూ..55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రిన్స్ పిక్చర్స్, ఎస్.లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోసారి కార్తి పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ చెన్నైలో పూర్తయ్యింది. ఇక తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ చేరుకుంది చిత్ర యూనిట్. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కారు చేజింగ్‌లతో కూడిన కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా షూట్ చేయనున్నారు.
అనంతరం.. యూరప్, హిమాలయాల బ్యాక్ డ్రాప్‌లో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్‌ను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. అలాగే.. యు.ఎస్.లోనూ షూటింగ్ జరుపుకోనుందీ చిత్రం. కాగా.. ఈ సినిమాలో కార్తి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం తొలిసారిగా కార్తి కాంబినేషన్‌లో పనిచేస్తున్నారు సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్. మరి.. ఖాకి తరువాత కార్తి, రకుల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments