నాగార్జున టైటిల్‌తో కార్తి...

  • IndiaGlitz, [Tuesday,January 16 2018]

ఒక‌ప్పుడు అక్కినేని నాగార్జున న‌టించిన చిత్రం 'చిన‌బాబు' అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో తెలుగులో ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో కార్తి హీరోగా న‌టిస్తుండ‌టం విశేషం.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇది అనువాద చిత్రం. త‌మిళంలో కార్తి, పాండిరాజ్ కాంబినేష‌న్‌లో హీరో సూర్య త‌న స్వంత బ్యాన‌ర్ 2డి ఎంట‌ర్‌టైన్మెంట్స్ పై ఈ సినిమాను నిర్మిస్తుండ‌టం విశేషం.

ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో కార్తి స‌ర‌స‌న స‌యేషా సైగ‌ల్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్రియా భ‌వాని హీరోయిన్స్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. ఈ వేస‌విలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.