'చినబాబు' ఆడియో జూన్ 23, సినిమా జులై 13న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కార్తీ నటించిన "చినబాబు" సినిమా ఆడియోను జూన్ 23న విడుదల చెయ్యబోతున్నారు. జులై 13న చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించారు. కార్తీ సరసన సయేషా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యాక్షన్ తో పాటు కామెడీ ఉండబోతోంది. కార్తీ ఈ మూవీలో రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. రైతుల సమస్యలను ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ఇటీవల విడుదలైన "చినబాబు" టీజర్ కు మంచి స్పందన లభించింది.
జూన్ 23న జరగబోయే "చినబాబు" ఆడియో విడుదల కార్యక్రమంలో కార్తీ, సూర్య పాల్గొనబోతున్నారు. నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. నటుడు శత్రు ఈ మూవీలో విలన్ గా నటించాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను హీరో సూర్య తో పాటు నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి "2డి ఎంటర్టైన్మెంట్స్" బ్యానర్ మరియు "ద్వారకా క్రియేషన్స్" బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ (చినదాని) లిరికల్ వీడియోకు మంచి స్పందన లభించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments