కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో 'ఖాకి'
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల సంగీతాన్ని విడుదల చేసి మ్యూజికల్ వరల్డ్ లో తనకంటూ సముచిత స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా . ఆయనకు తెలుగు పరిశ్రమతో విడదీయరాని అనుబంధం ఉంది. సినీ ప్రముఖులు అందరితోనూ సత్సంబంధాలున్నాయి. రెండు పదుల ఏళ్లు సినిమా రంగాన్ని అతి దగ్గరగా పరిశీలించిన అనుభవంతో ఆయన తొలిసారి ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యారు. అందులో భాగంగా తమిళ్లో రూపొందుతున్న ఓ చిత్రాన్ని ప్రప్రథమంగా తెలుగులో డబ్ చేస్తున్నారు. కార్తి, రకుల్ ప్రీత్‌సింగ్ కాంబినేషన్లో తమిళంలో తెరకెక్కుతున్న `ధీరన్ అధిగారమ్ ఒండ్రు` అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.
ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ ``` చతురంగ వేట్టై` చిత్రంతో సంచలన విజయం సాధించిన హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `ధీరన్ అదిగారమ్ ఒండ్రు`. ఆ చిత్రానికి తెలుగులో `ఖాకి` అనే టైటిల్ పెట్టాం. ద పవర్ ఆఫ్ పోలీస్ అనేది శీర్షిక. ఒక పాట, వారం రోజుల టాకీ పార్టు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆగస్టు నెలాఖరునగానీ, సెప్టెంబర్‌లోగానీ సినిమాను విడుదల చేస్తాం. జిబ్రాన్ వినసొంపైన సంగీతాన్ని అందిస్తున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన రియల్ ఇన్సిడెంట్‌ని ఆధారంగా చేసుకుని ఈ కథ తయారు చేసారు . ఎక్స్ ట్రార్డినరీ కాన్సెప్ట్. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు ప్రేక్షకులకు ఈ కథను అందించాలని ఈ సినిమా రైట్స్ తీసుకున్నాను. కార్తి పవర్ఫుల్ కేరక్టర్లో కనిపిస్తారు. మన దగ్గర టాప్ హీరోలందరూ పోలీస్ డ్రస్సుల్లో మెప్పించిన వారే. కార్తీ కూడా మన `విక్రమార్కుడు` తమిళ వెర్షన్లో పోలీస్ గెటప్‌లో చేసి సక్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకుని చేస్తున్నారు`` అని అన్నారు. అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ ఇతర పాత్రధారులు.
ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, ఆర్ట్: కె.ఖదీర్, ఎడిటర్: శివనందీశ్వరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, డ్యాన్స్: బృంద, నిర్మాతలు : ఉమేశ్ గుప్తా,సుభాష్ గుప్తా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments