'ఖాకి'లో కార్తి, రకుల్ కెమిస్ట్రీ

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

ఒక సినిమా హిట్ కావడానికి చాలా అంశాలు దోహదం చేస్తుంటాయి. కొన్ని సార్లు యాక్షన్, మరికొన్ని సార్లు కామెడీ.. ఇలా ఒక్కోసారి ఒక్కొక్క జోనర్ అంశాలు పైచేయిగా నిలుస్తుంటాయి. అయితే ఎవర్గ్రీన్ విషయం, ఎవర్గ్రీన్గా యువ హృదయాలను కదిలించే అంశం రొమాన్స్.

తెరపై రొమాన్స్ జరుగుతున్నంత సేపు, రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నంత సేపు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు మంత్రముగ్ధుడై పోతాడు. అందుకు హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా అవసరం అవుతుంది. తాజాగా 'ఖాకి' సినిమాలో 'తొలి వయసే' పాటను, ట్రైలర్ను, మేకింగ్ వీడియోలను చూస్తుంటే అలాంటి ఫీలింగే కలుగుతోంది.

కార్తి, రకుల్ తొలి సారి కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య సన్నివేశాలు, షాట్లు అంతే అన్యోన్యంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని షాట్లు వయోభేదం లేకుండా అందరికీ గిలిగింతలు పెడతాయనయడంలో అనుమానం లేదు.

ఈ నెల 17న విడుదల కానున్న ఈ సినిమాను హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించారు. జిబ్రన్ అందించిన సంగీతం సినిమాకు హైలైట్గా నిలిచింది.