'కర్త కర్మ క్రియ' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Monday,October 01 2018]

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తొన్న కర్త క్రియ కర్మ సినిమా టైటిల్ ఫస్ట్ టీజర్ ను విడుదల చేశారు. వీకెండ్ లవ్ ఫేం నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ సినిమాలకంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసేలా ఉంటుంది. కర్త కర్మ క్రియటీజర్ ను విడుదల చెస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలొనె పాటలను విడుదల చెస్తామన్నారు.

దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కధ ఇది. మనం రోజు చూసె ,వినె కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన ఎలిమెంట్ తో ఈ కర్త కర్మ క్రియ ను రూపొందిస్తున్నాము. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. మంచి టెక్నికల్ టీమ్ మా సినిమాకు సెట్ కావటంతో పాటు, నిర్మాతల సపోర్ట్ మా సినిమాకు ప్రధాన బలం. పక్కా ప్లానింగ్ తో అనుకున్న సమయానికి ఈ సినిమాను కంప్లీట్ చెశాము. హీరొ హీరొయిన్ లు కొత్త వారైనా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. టెక్నికల్ గా అంతే ఉత్తమం గా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తీశాము. ఈ ఫస్ట్ టీజర్ ను ఈ రోజు విడుదల చెస్తున్నాము. మాటీమ్ అందరికీ పేరొస్తుందన్న నమ్మకముందన్నారు.

వసంత్ సమీర్, సెహర్, నూతన్ రాయ్, రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, కాదంబరి కిరణ్, నీలిమ, జయప్రకాష్, శ్రీసుధ, కాశీవిశ్వనాధ్, సంధ్య పెద్దాడ, రమణారెడ్డి, కృష్ణతేజ, లోహిత్, మహేందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గాకిషోర్ బోయిదాపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: అనీ , కాస్ట్యూమ్స్: టి.ఎస్.రావు, కాస్ట్యూమ్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాణ నిర్వహణ: వినాయకరావు నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన-దర్శకత్వం: నాగు గవర.

More News

సింధు బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది...

రీసెంట్‌గా బాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ స్టార్ట‌య్యింది. ఇప్పుడు మ‌రో బాడ్మింట‌న్ క్రీడాకారిణి, ఒలింపిక్ ప‌త‌క విజేత పి.వి.సింధు బ‌యోపిక్‌కి రంగం సిద్ధ‌మ‌వుతుంది.

మరో అడుగు మార్పుకోసం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంఛ్

సమాజిక బాధ్యతను గుర్తు చేసే సినిమాలు అరుదుగా వస్తాయి. అంటువంటి అరుదైన చిత్రమే 'మరో అడుగు మార్పుకోసం'.

మ‌హేశ్ మంచి మ‌న‌సు...

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ కేవ‌లం సినిమాల‌కో.. క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కో ప‌రిమితం కాదు. ఆయ‌న స్టార్ డ‌మ్ వెనుక పెద్ద మ‌న‌సుంది.

'నోటా' పబ్లిక్ మీట్..!!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ' నోటా' అక్టోబర్ 5 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసాడు..

నేను పని చేసిన గొప్ప పది చిత్రాల్లో 'బేవ‌ర్స్' సినిమా ఉంటుంది - రాజేంద్రప్రసాద్

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్