జావెద్ అక్తర్‌ను బెదిరించిన కర్ణిసేన
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణిసేన పేరు గుర్తుందా? `పద్మావత్` సినిమా సమయంలో విడుదలను అడ్డుకున్న హిందూ అనుకూల సంస్థ. ఇప్పుడు కర్ణిసేన మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకంటే.. ప్రముఖ బాలీవుడ్ రచయిత జావెద్ అక్తర్‌ను బెదిరించడం ద్వారా. వివరాల్లోకెళ్తే బోపాల్ పార్లమెంట్ సభ్యుడు స్వాధ్వి ప్రజ్ఞా ముస్లిమ్స్కు బుర్ఖా నిషేధ చట్టం విధించాలని డిమాండ్ చేశారు.
దీనిపై జావెద్ అక్తర్ మాట్లాడుతూ గున్‌జాన్(మేలి ముసుగు)ని కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు. దీనిపై మహారాష్ట్ర కర్ణిసేన అధ్యక్షుడు జీవన్ సింగ్ ``జావెద్ అక్తర్ మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని. ఆయన కళ్లు పీకేస్తాం. నాలుక కోస్తాం.. ఇంట్లోకి చొరబడి చితకబాదుతాం`` అని వీడియో ద్వారా బెదిరించారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout