యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసిన కర్ణాటక అభిమానులు..
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి ది బిగినింగ్` చిత్రంతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కర్ణాటక రాష్ట్రానికి చెందిన అభిమానులు కలుసుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి మరికొంత మంది అభిమానులను కలుసుకున్న ప్రభాస్ వారితో చాలా సేపు ముచ్చటించారు. ఓ మహిళా అభిమాని వేసిన తన పెయిటింగ్స్ ను చూసి ప్రభాస్ ఆమెను అభినందించారు. వారితో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. కర్ణాటకలో ప్రభాస్ సినిమా రిలీజ్, పుట్టినరోజు సందర్భంల్లో అక్కడి అభిమానులు చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న ప్రభాస్ ఎంతో హ్యపీగా ఫీలయ్యారు. అంతే కాకుండా ఈసారి బెంగళూరు వచ్చినప్పుడు తన అభిమానులను తప్పకుండా కలుసుకుంటానని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com