Karnataka Exit Poll 2023: కాంగ్రెస్‌ వైపే మొగ్గు.. కానీ హంగ్‌కే ఛాన్స్, అన్ని సర్వేలది ఇదే మాట

  • IndiaGlitz, [Thursday,May 11 2023]

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తోన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ముగిసింది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు అన్ని అస్త్రశస్త్రాలను ఉపయోగించాయి. ఇక అంతిమ తీర్పు ప్రజలదే కావడంతో అందరి చూపు మే 13పై పడింది. మరోవైపు .. జాతీయ ఛానెల్స్, ఇతర ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి. వీటి ప్రకారం కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ.. హంగ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా వున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్‌గా నిలిచే అవకాశాలు వుండటంతో కాంగ్రెస్, బీజేపీలు ఆ పార్టీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి జాతీయ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే:

న్యూస్ నేషన్ :

కాంగ్రెస్ 86
బీజేపీ 114
జేడీఎస్ 21

పీపుల్స్ పల్స్ :

కాంగ్రెస్ 107 - 109
బీజేపీ 78 - 90
జేడీఎస్ 23 - 29
ఇతరులు 1 - 3

రిపబ్లిక్ టీవీ :

కాంగ్రెస్ 94 - 108
బీజేపీ 85 - 100
జేడీఎస్ 24 - 32
ఇతరులు 2 - 6

జన్ కీ బాత్ :

కాంగ్రెస్ 91 - 106
బీజేపీ 94- 117
జేడీఎస్ 14- 24

జీ మార్క్ :

కాంగ్రెస్ 103 - 118
బీజేపీ 79 - 94
జేడీఎస్ 25 - 33

జీ మాట్రిజ్

కాంగ్రెస్ 103 - 118
బీజేపీ 79 - 94
జేడీఎస్ 25 - 33

సువర్ణ న్యూస్ :

బీజేపీ 94 - 117
కాంగ్రెస్ 91 - 106
జేడీఎష్ 14 - 24

టైమ్స్ నౌ :

కాంగ్రెస్ 106 - 120
బీజేపీ 78 - 92
జేడీఎస్ 20 - 26
ఇతరులు 2 - 4

సీ ఓటర్ :

కాంగ్రెస్ 106
బీజేపీ 89
జేడీఎస్ 28

ఏబీపీ న్యూస్ :

కాంగ్రెస్ 100 - 112
బీజేపీ 83 - 95
జేడీఎస్ 21 - 29
ఇతరులు 2 - 6

సీజీఎస్ :

కాంగ్రెస్ 86
బీజేపీ 114
జేడీఎస్ 21