సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన కొద్ది రోజులుగా కార్యకలాపాలన్నీ ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కరోనా సోకింది. వైద్యుల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరానని యడియూరప్ప వెల్లడించారు. తనతో సమావేశాల్లో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ట్వీట్ చేశారు.
‘‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచించడంతో ఆస్పత్రిలో చేరా. నాతో సమావేశాల్లో పాల్గొన్న వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోవాలని కోరుతున్నాను’’ అని యడియూరప్ప ట్వీట్‌లో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com