సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్..

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన కొద్ది రోజులుగా కార్యకలాపాలన్నీ ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కరోనా సోకింది. వైద్యుల సూచన మేరకు తాను ఆసుపత్రిలో చేరానని యడియూరప్ప వెల్లడించారు. తనతో సమావేశాల్లో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ట్వీట్ చేశారు.

‘‘నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచించడంతో ఆస్పత్రిలో చేరా. నాతో సమావేశాల్లో పాల్గొన్న వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోవాలని కోరుతున్నాను’’ అని యడియూరప్ప ట్వీట్‌లో పేర్కొన్నారు.

More News

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం..

మూడు రాజధానుల అంశంపై జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలవాలని నిర్ణయించారు. నేడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.

బ్రేకింగ్: అమిత్ షాకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కరోనా బారిన పడగా..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. తెలంగాణ నేతలతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోడంతో..

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నేడు దాదాపు 55 వేల కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఐదు రోజులుగా 50 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.

‘ఆకాశ‌వాణి’ యూనిట్‌కు రానా సపోర్ట్

ఇప్పుడంటే వినోద మాధ్య‌మాలు ఎక్కువైయ్యాయి కానీ.. ఒక‌ప్పుడు అంద‌రికీ ప్ర‌ధాన వినోద సాధనం రేడియోనే.