'కర్ణన్' బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోతో రొమాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ధనుష్ హీరోగా నటించిన ' కర్ణన్' చిత్రం ప్రస్తుతం సౌత్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. సామాజిక అణచివేత పై గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. సహజసిద్ధమైన హావభావాలతో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మలయాళీ యంగ్ బ్యూటీ రజిషా విజయన్ పల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా నటించింది. కర్ణన్ చిత్రం ఆమెకు మరిన్ని ఆఫర్స్ తెచ్చిపెడుతుంది అనడంలో సందేహం లేదు.
ఇదీ చదవండి: కొరియన్ పిల్లతో కాదా.. మళ్ళీ ఆమెతోనే రాంచరణ్ రొమాన్స్ ?
త్వరలోనే రజిషా టాలీవుడ్ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ త్వరలో శరత్ మండవ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమం జరిగింది. మజిలీ ఫేం దివ్యాన్ష కౌషిక్ ఓ హీరోయిన్ గా ఎంపికైంది.
మరో హీరోయిన్ రోల్ కోసం రజిషాతో చర్చలు జరుపుతున్నారు. ఇది కనుక ఓకే అయితే రజిషాకి టాలీవుడ్ లో మంచి ఆఫర్ దక్కినట్లే.
సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శామ్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడి మూవీలో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com