గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా GFA అవార్డు అందజేసిన బాలీవుడ్ స్టార్ కరిష్మా కపూర్
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాదిలో అత్యుత్తమ శిక్షణ సంస్థగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ పురస్కారాన్ని అందుకుంది. ఢిల్లీకి చెందిన యాప్స్ గ్రూప్ రైసింగ్ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 21న గోవాలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ దక్షిణాది నుంచి మొదటి స్థానంలో నిలిచింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ జీఎఫ్ఏకు ఈ పురస్కారాన్ని అందించింది. రైసింగ్ లీడర్ షిప్ అవార్డు అందుకోవడంపై గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ సంస్థ ఛైర్మన్ దీపక్ బల్దేవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆయన మాట్లాడుతూ...రైసింగ్ లీడర్ షిప్ అవార్డు మాకు దక్కడం గౌరవంగా భావిస్తున్నాము. మరింత ప్రభావంతంగా పనిచేసేందుకు మాకు ఈ పురస్కారం స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ రెండేళ్లలో మా సంస్థకు 7 అవార్డులు దక్కాయి. 2016 లో నాలుగు పురస్కారాలు రాగా...ఈ ఏడాది మూడు అవార్డులు అందుకున్నాం. మా సంస్థలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నప్పుడు మాకు ఈ పురస్కారాల దక్కడం కంటే ఎక్కువ ఆనందాన్ని కలుగుతుంది. ప్రతి విద్యార్థి విజయమే మా గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ విజయంగా భావిస్తాము. అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments