రాజీనామా చేసి వైసీపీలో చేరిన కారెం శివాజీ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్షపార్టీలకు చెందిన సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, మాజీలు పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే. అటు వైసీపీలోకి.. ఇటు బీజేపీలోకి నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. తాజాగా ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కరెం శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కారెం శివాజీ వైసీపీలో చేరారు. కారెం శివాజీకి.. జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీలో దళిత నేతగా గుర్తింపు సంపాదించుకున్న కారెం శివాజీ తాజాగా వైసీపీలో చేరారు.
రాజీనామా చేసి వైసీపీలో చేరిక..
కాగా.. వైసీపీలో చేరాలంటే ముందుగా పదవీకి రాజీనామా చేయాల్సిందే. అందుకే పార్టీలో చేరేందుకు వీలుగా శివాజీ నిన్ననే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి శుక్రవారం మధ్యాహ్నం సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వగా, అరకు ఎంపీ మాధవితో కలిసి సీఎం కార్యాలయానికి వచ్చి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో తాను కండువా కప్పుకున్నట్లు చెప్పారు. టీడీపీలో సరైన గుర్తింపు లేకనే రాజీనామా చేశానని.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్‌గా సుమారు మూడున్నర ఏళ్ళు పనిచేశానన్నారు. పదవీ కాలం ఉన్నా.. సీఎం వైయస్ జగన్ ఆశయాలకు ఆకర్షితుడినై రాజీనామా చేసి బేషరతుగా వైసీపీలో చేరినట్లు శివాజీ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments