రాజీనామా చేసి వైసీపీలో చేరిన కారెం శివాజీ..

  • IndiaGlitz, [Friday,November 29 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్షపార్టీలకు చెందిన సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, మాజీలు పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే. అటు వైసీపీలోకి.. ఇటు బీజేపీలోకి నేతలు జంపింగ్‌లు చేస్తున్నారు. తాజాగా ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కరెం శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో కారెం శివాజీ వైసీపీలో చేరారు. కారెం శివాజీకి.. జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీలో దళిత నేతగా గుర్తింపు సంపాదించుకున్న కారెం శివాజీ తాజాగా వైసీపీలో చేరారు.

రాజీనామా చేసి వైసీపీలో చేరిక..

కాగా.. వైసీపీలో చేరాలంటే ముందుగా పదవీకి రాజీనామా చేయాల్సిందే. అందుకే పార్టీలో చేరేందుకు వీలుగా శివాజీ నిన్ననే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి శుక్రవారం మధ్యాహ్నం సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వగా, అరకు ఎంపీ మాధవితో కలిసి సీఎం కార్యాలయానికి వచ్చి కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయాలకు, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో తాను కండువా కప్పుకున్నట్లు చెప్పారు. టీడీపీలో సరైన గుర్తింపు లేకనే రాజీనామా చేశానని.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ చైర్మన్‌గా సుమారు మూడున్నర ఏళ్ళు పనిచేశానన్నారు. పదవీ కాలం ఉన్నా.. సీఎం వైయస్‌ జగన్ ఆశయాలకు ఆకర్షితుడినై రాజీనామా చేసి బేషరతుగా వైసీపీలో చేరినట్లు శివాజీ తెలిపారు.

More News

ప్రియాంకరెడ్డి హత్యకేసు: నటీనటుల తీవ్ర ఆగ్రహం

దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు.

ప్రియాంకరెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు దొరికాయ్: సజ్జనార్

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రియాంరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేవలం 24 గంటల్లోనే నిందితులెవరో తెలుసుకుని ఈ కేసు ఛేదించారు.

శానిటరీ వర్కర్‌ జాబ్ కోసం 7వేల మంది గ్రాడ్యుయేట్లు క్యూ...

ప్రస్తుత కాలంలో జాబ్ ఉంటే చాలు.. అది ఏం వర్క్ ఏం అనేది మాత్రం నిరుద్యోగులు చూడట్లేదు.

ప్రియాంక హత్య కేసు: రంగంలోకి దిగిన కేటీఆర్

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డిని కొందరు మానవమృగాలు అత్యాచారం చేసి ఆపై..

'ఇద్ద‌రి లోకం ఒక‌టే' సెన్సార్ పూర్తి..

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో