అమరావతికి కరీనా..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ తార కరీనా కపూర్ అమరావతికి వస్తుంది. అయితే సినిమా షూటింగ్ కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విబ్రి మీడియా సంయుక్తంగా సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నవంబర్ 10న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్, సౌతిండియాకు చెందిన పలువురు తారలు అతిథులుగా విచ్చేస్తున్నారు.
ఇందులో కరీనా కపూర్ ప్ర్యతేక ఆకర్షణగా నిలవనున్నారు. గత ఏడాది ఈ వేడుకల్లో దీపికా పదుకొనె పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ అవార్డ్ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాజధాని అమరావతిని వీలైనంతగా ప్రమోట్ చేసే పనిలో ప్రభుత్వం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments