కరీనా కోరిక నిజమైంది..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటి కరీనా కపూర్ తల్లి కాబోతుంది. కరీనా మూడు నెలల గర్భవతి...అంటూ గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఈ వార్తల పై కరీనా స్పందిస్తూ...ఈ వార్తలు వింటుంటే భలే తమాషాగా ఉంది. ఈ వార్తలు త్వరలో నిజం కావాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఇప్పుడు కరీనా కోరిక నిజం అయ్యింది. ఈ విషయాన్ని కరీనా భర్త సైఫ్ ఆలీఖాన్ తెలియచేస్తూ...కరీనా ప్రెగ్నెంట్ అని ఎనౌన్స్ చేసారు. తాము డిసెంబర్ లో తొలి సంతానాన్ని ఎత్తుకోబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మమ్మల్ని అభినందించిన అభిమానులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు అని సైఫ్ ఆలీఖాన్ తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com