కరీనా, అమృతా అరోరాలకు కోవిడ్ .. వరుసపెట్టి పార్టీలకీ, బాలీవుడ్ స్టార్స్‌లో ఆందోళన
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ ముప్పు తగ్గింది అనేలోపు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో కలకలం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక, ఏపీ, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఒమిక్రాన్ నమోదైంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులను ముఖ్యంగా సినీతారలను కబళించింది కరోనా. ఇప్పటికీ పలువురు స్టార్స్ వైరస్ బారినపడుతున్నారు. ఇటీవలే విలక్షణ నటుడు కమల్ హాసన్‌కు కరోనా నిర్థారణ కావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు కరీనా కపూర్, అమృతా అరోరాలకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా బీ టౌన్ టాక్. ఈ ఇద్దరూ కోవిడ్ రూల్స్‌ని ఉల్లంఘించి పలు పార్టీలకు హాజరైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కరీనా, అమృతాలను ఇటీవల కలిసిన వాళ్లందరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించింది. కరీనా, అమృతా ఇద్దరూ కూడా సూపర్ స్ప్రెడర్స్‌గా మారినట్లు కార్పోరేషన్ పేర్కొంది.
ఇకపోతే వీరిద్దరూ వెళ్లిన పార్టీలలో కొందరు సూపర్ స్టార్స్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు కరీనా, అమృతాలకు కరోనాగా తేలడంతో చాలా మంది స్టార్స్‌లో టెన్షన్ మొదలైంది. దీంతో ఒక్కొక్కరిగా ల్యాబ్‌లకు వెళ్లి టెస్ట్‌లు చేయించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాబోయే ఒకట్రెండు రోజుల్లో హిందీ ఇండస్ట్రీలో మరింత మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
మరోవైపు మహారాష్ట్ర ఒమిక్రాన్ వేరియంట్‌కు హాట్‌స్పాట్‌గా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అధిక భాగం ఇక్కడే వెలుగు చూశాయి. ఈ క్రమంలో సోమవారం కూడా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments