రానా సినిమాను విడుద‌ల చేస్తున్న క‌ర‌ణ్‌ జోహార్

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

'బాహుబ‌లి ది బిగినింగ్' సినిమాను ద‌ర్మేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బాలీవుడ్‌లో విడుద‌ల చేసి తెలుగు సినిమా మార్కెట్‌కు హిందీలో మార్గం వేసుకునేలా దోహ‌ద‌ప‌డిన నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు రానా ద‌గ్గుబాటి హీరోగా పివిపి బ్యాన‌ర్‌పై సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఘాజి'. 1971లో ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో ఇండియ‌న్ నేవీలో కీల‌క‌పాత్ర పోషించిన ఈ యుద్ధ‌నౌక స‌ముద్రంలోనే మునిగిపోయింది.

దాన్ని ఆధారంగా చేసుకుని భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేలా రూపొందిస్తున్నార‌ట‌. ఈ చిత్రాన్ని హిందీలో క‌ర‌ణ్ జోహార్ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో ద‌క్కించుకోవ‌డం విశేషం. అల్రెడి రానాకు హిందీలో మంచి గుర్తింపు ఉంది, అలాగే తాప్సీ హీరోయిన్‌గా, కె.కె.మీన‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌టం వంటివి హిందీలో కూడా వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని క‌ర‌ణ్ జోహార్ బ‌లంగా న‌మ్ముతున్నాడ‌ట‌.