డ్ర‌గ్స్ కేసు.. క‌ర‌ణ్ జోహార్‌కు నోటీసులు

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హత్య త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు బాలీవుడ్ సినీ ప్రముఖులు చాలా మందికి ఇబ్బందిగానే మారింద‌ని చెప్పాలి. ముఖ్యంగా సీబీఐ విచార‌ణ‌లో డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట‌కు రావ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. రంగంలోకి దిగిన ఎన్‌సీబీ, ఈ డ్ర‌గ్స్ కేసులో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క‌వ్ర‌ర్తి, ఆమె సోద‌రుడు స‌హా మ‌రికొంద‌రినీ అరెస్ట్ చేసింది. బాలీవుడ్ నుండి శాండిల్‌వుడ్‌కి ఈ డ్ర‌గ్స్ కేసు పాకింది. సంజ‌న‌, రాగిణి ద్వివేదిల‌ను పోలీసులు ఆరెస్ట్ చేశారు. అదే స‌మ‌యంలో టాలీవుడ్ సెల‌బ్రిటీల పేర్లు కూడా ప్ర‌ముఖంగా వినిపించాయి.

బాలీవుడ్ విష‌యానికి వ‌స్తే దీపికా ప‌దుకొనే, సారా అలీఖాన్‌, ఆలియా భ‌ట్‌, నిర్మాత క్షితిజ్ ప్ర‌సాద్, క‌రిష్మా ప్ర‌కాశ్‌, మ‌ధు మంతెన‌ స‌హా చాలా మంది స్టార్స్ ఎన్‌సీబీ విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌కు ఎన్‌సీబీ నోటీసులు జారీ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఏడాది క‌ర‌ణ్‌జోహార్ ఇచ్చిన ఓ పార్టీలో డ్ర‌గ్స్ వాడార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.దీంతో విచార‌ణకు హాజ‌ర కావాలంటూ ఎన్‌సీబీ క‌ర‌ణ్‌జోహార్‌కు నోటీసుల‌ను జారీ చేసింది. ఈయ‌న త‌ర్వాత ఎన్‌సీబీ ఇంకెంత మందికి నోటీసులిస్తుందో చూడాలి.

More News

హీరోకు 50... హీరోయిన్‌కు 19 ఏళ్లా?: దియా మీర్జా

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నానని.. ముఖ్యంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ అడగొద్దు: హైకోర్టు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి చట్టం లేకుండా ధరణిలో ఆస్తుల నమోదుతోపాటు..

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ ‘ఎఫ్ 3’ ప్రారంభం

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా గ‌త ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వకీల్‌సాబ్’ పిక్స్..

బాలీవుడ్ సినిమా ‘పింక్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నారు.

రూ.30 కోట్లు దానం చేసి ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచింది..

నాలుగు నెలల్లో చేతికి ఎముకలేదన్నట్టుగా రూ.30 కోట్లు దానం చేసింది. అయినా కూడా ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మహిళల లిస్టులో అగ్ర స్థానంలో నిలిచింది.