బాహుబలి కిరణ్ రాజ్ హీరోగా 'కరాళి' చిత్రం ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎమ్.జె.మోషన్ పిక్చర్స్ పతాకంపై మల్లిఖార్జున్ రెడ్డి, మొహమ్మద్ జాఫర్ అలీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కరాళి. ఈ చిత్రానికి కిరణ్ కోటప్రోలు దర్శకుడు కాగా.. హీరో బాహుబలి కిరణ్ రాజ్. బుధవారం ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ముహుర్తపు సన్నివేశానికి బాహుబలి కెమెరామెన్ సెంథిల్ క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకులు వీరశంకర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ముహుర్తపు సన్నివేశానికి టెర్రర్ చిత్ర నిర్మాత ఆరా మస్తాన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట్ శంకర్, నటుడు రాజేంద్ర, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ కథకు బాహుబలిలో ప్రభాస్‌కు డబుల్ యాక్టర్‌గా వర్క్ చేసిన కిరణ్ యాఫ్ట్ అనిపించి, అతన్ని హీరోగా ఈ చిత్రానికి ఎన్నుకున్నాం. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరక్కెనున్న ఈ చిత్రం ఆడియెన్స్‌ని మెప్పించేలా ఈ చిత్ర కథాంశం ఉంటుంది. ఇతర నటీనటుల వివరాలను అతి త్వరలో తెలియజేస్తాం...అని అన్నారు.
చిత్ర నిర్మాతలు మల్లిఖార్జున్ రెడ్డి, మొహమ్మద్ జాఫర్ అలీ లు మాట్లాడుతూ.. '' దర్శకుడు కిరణ్ చెప్పిన కథ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే మేమే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంత వరకు ప్రేక్షకులు ఎప్పుడు వెండితెరపై చూడని మంచి కథాంశంతో నిర్మాతలుగా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఖర్చుకు వెనకాడకుండా..అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాం..అని అన్నారు.
కెమెరామెన్ ముజీర్‌మాలిక్ మాట్లాడుతూ.. హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగిన సబ్జెక్ట్ ఇది. ఓ ఛాలెంజ్‌గా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించనున్నాం... అన్నారు.
హీరో బాహుబలి కిరణ్ రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా గురించి మాట్లాడేముందు బాహుబలి సినిమా గురించి మాట్లాడాలి. ఆ సినిమా మాకు ఒక విశ్వవిద్యాలయం. వల్లీ మేడమ్ దగ్గర నుండి క్రమశిక్షణ, రమా మేడమ్ దగ్గర నుండి మంచితనం, రాజమౌళి గారి దగ్గర నుండి కష్టపడేతత్వంని నేర్చుకున్నాను. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం నా హీరో ప్రభాస్ దగ్గర నుండి నేర్చుకున్నాను. వీళ్లను ఆదర్శంగా తీసుకునే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాను. దర్శకుడు కిరణ్ నాకు ఎప్పటి నుండో పరిచయం. ఆ పరిచయంతో అతని దగ్గర ఉన్న స్క్రిఫ్ట్ నాకు చెప్పి..నన్నే హీరోగా చేయమని అడిగాడు. కథ అద్భుతంగా ఉంది. అందుకే హీరోగా చేసేందుకు వెనకాడలేదు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన సెంథిల్‌గారికి, అంబర్‌పేట్ శంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments