'కపటధారి' థీమ్ ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్కియాలజీలో ఎప్పుడో జరిగిన హత్య... హంతకుడు ఎవరో తెలియదు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా అంతు పట్టని ఆ హంతకుడు రహస్యాన్ని ఓ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఎలా చేధించాడనే అంశంతో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ `కపటధారి`.
వైవిధ్యమైన పాత్రలు, కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపించే హీరో సుమంత్ మరో విభిన్నమైన పాత్రలో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కపటధారి చిత్రంలో సుమంత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించారు. కన్నడంలో సూపర్ హిట్ చిత్రమైన `కావలుధారి` సినిమాకు ఇది రీమేక్. `కపటధారి` చిత్రం ఫిబ్రవరి 19న విడుదల కానుంది. ఈ సినిమా థీమ్ ట్రైలర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఓ మనిషి నిజాన్ని బతికించడానికి సమరం చేయాలని చెప్పే మాంటేజ్ సాంగ్ ఈ థీమ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. అసలు హంతకుడు ఎవరు? అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతూ ఇప్పటి వరకు చేసిన `కపటధారి` ప్రమోషన్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మంగళవారం(ఫిబ్రవరి 16)రోజున `కపటధారి` ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధనంజయన్ నిర్మిస్తున్నారు.నాజర్, సంపత్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా సమంత అక్కినేని విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
నటీనటులు: సుమంత్, నందిత, నాజర్, జయప్రకాశ్, సంపత్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments