‘కపటనాటక సూత్రధారి’ సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కపటనాటక సూత్రధారి’. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. ఫ్రెండ్స్ అడ్డా బ్యానర్‌పై మనీష్ (హలీమ్) నిర్మించిన ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించారు. ఉమా శంకర్, వెంకటరామరాజు, శరత్ కుమార్, జగదీశ్వర్ రావు, శేషు కుమార్, ఎండి హుస్సేన్ సహా నిర్మాతలు.
ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత మనీష్ మాట్లాడుతూ ‘‘మా ‘కపట నాటక సూత్రధారి’ సెన్సార్ పూర్తయ్యింది. మంచి థ్రిల్లర్ మూవీ చేశామని సెన్సార్ సభ్యులు మా టీమ్‌ను అప్రిషియేట్ చేశారు. డైరెక్టర్ క్రాంతి సైన సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సుభాష్‌గారి విజువల్స్, రామ్‌గారి సంగీతం, వికాస్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యాయి. కచ్చితంగా సినిమా ఆడియెన్స్‌ను డిఫరెంట్ మూవీగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన డిఫరెంట్ పోస్టర్స్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేది అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
నటీనటులు: విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ,విజయ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments