'కనులు కనులను దోచాయంటే' చూసిన వాళ్లందరికీ నచ్చింది - దుల్కర్ సల్మాన్

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలవుతోంది. దేసింగ్‌ పెరియసామి దర్శకుడు. నిర్మాణ సంస్థలు వయోకామ్‌ 18 స్టూడియోస్‌, ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో 'కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌' కమలాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డితో కలిసి డా. రవికిరణ్ విడుదల చేశారు. ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. మౌత్ టాక్ బావుండడంతో రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ‘‘చూసిన వాళ్లందరికీ సినిమా నచ్చింది. ఓటీటీ, డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో చూసే సినిమా కాదు. ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా. నేను సినిమాను సింగిల్‌గా చూశా. థియేటర్లలో చూశా. ఈ సినిమాకు థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ వేరు. ఓటీటీలో వస్తుందని వెయిట్‌ చేయకండి. అనీష్‌ కురువిల్ల చాలా అందమైన విలన్‌గా చేశారు. రీతూ వర్మ అందమైన, టాలెంట్‌ ఉన్న అమ్మాయి. సినిమాలో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేసింది. నా క్యారెక్టర్‌ సినిమా స్టార్టింగ్‌ నుండి ఆల్మోస్ట్‌ ఒకేలా ఉంటుంది. కానీ, ఆమె క్యారెక్టర్‌లో చాలా షేడ్స్‌ ఉన్నాయి. రీతూ సెటిల్డ్‌ పర్ఫార్మెన్స్‌ చేసింది. దర్శకుడు దేసింగ్‌ పెరియసామి హార్డ్‌ వర్క్‌కి రిజల్ట్‌ ఈ సినిమా. మాకు ఈ విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని అన్నారు.

రీతూ వర్మ మాట్లాడుతూ ‘‘ వేరే సినిమా షూటింగులో ఉండడంతో సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌కి అటెండ్‌ కాలేదు. అయితే... చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి సినిమాతో రావడం సంతోషంగా ఉంది. తమిళంలో సినిమా పెద్ద హిట్‌ అని అక్కడ ప్రేక్షకులు డిక్లేర్‌ చేశారు. తెలుగులో మౌత్‌ టాక్‌తో పికప్‌ అవుతోంది. కంటెంట్‌ బావుంటే తెలుగు ప్రేక్షకులు సినిమాను హిట్‌ చేస్తారని ‘కనులు కనులను దోచాయంటే’ మరోసారి నిరూపించింది. దర్శకుడు దేసింగ్‌ పెరియసామి, సినిమాటోగ్రాఫర్‌ భాస్కరన్‌ ఈ సినిమాకు రియల్‌ హీరోలు. ఐదేళ్లు దర్శకుడు ఈ కథ, సినిమా కోసం కష్టపడ్డారు. కమర్షియల్‌ సినిమాల్లో హీరోయిన్లకు పర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న రోల్స్‌ దొరకడం కష్టం. నాకు ఈ సినిమాలో మంచి రోల్‌ దొరికింది. దుల్కర్‌ సల్మాన్‌ గుడ్‌ కో–స్టార్‌. తనతో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. రక్షణ్‌ కామెడీ టైమింగ్‌ అదుర్స్‌. నిరంజని సినిమాలో నా పార్టనర్‌గా కనిపించడమే కాదు, నాకు స్టైలిస్ట్‌గా వర్క్‌ చేసింది. తనకు థ్యాంక్స్‌. ఆడియన్స్‌ సినిమాను మరింత హిట్‌ చేస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

డా. రవికిరణ్‌ మాట్లాడుతూ ‘‘ కథ, కంటెంట్‌ నచ్చడంతో కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రైట్స్‌ తీసుకున్నా. అండర్‌డాగ్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ ఆదరణతో కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అని నిరూపించింది. శని, ఆదివారాల్లో వసూళ్లు బావున్నాయి. సోమవారం మరింత పికప్‌ అయింది. రోజు రోజుకూ వసూళ్లు పెరుగడం సంతోషాన్నిస్తోంది. తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్‌. తెలుగులో మంచి టాక్‌ రావడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

అనిష్‌ కురువిల్ల మాట్లాడుతూ ‘‘ మల్టీజానర్‌ ఫిల్మ్‌ ఇది. మంచి రైటింగ్‌, మంచి కాస్టింగ్‌ ఉంటే సినిమా సక్సెస్‌ అవుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్‌. దర్శకుడిగా ఇటువంటి సినిమా రాయడం, తీయడం కష్టం. థియేటర్లలోకి అరుదుగా ఇటువంటి సినిమాలు వస్తాయి. ‘పెళ్లి చూపులు’, ‘భరత్‌ అనే నేను’ తర్వాత మంచి రోల్‌ చేశా. సినిమాకు వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ బావుంది’’ అని అన్నారు.

రక్షణ్‌ మాట్లాడుతూ ‘‘ చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో పబ్లిసిటీకి వచ్చినప్పుడు నాకింత పేరు వస్తుందని ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులు నన్ను అప్రిషియేట్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజని, భాస్కరన్‌ పాల్గొన్నారు.

ఇతర తారాగణం: రక్షణ్, నిరంజని అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు

More News

ప్రభాస్‌పై కరోనా ఎఫెక్ట్..!

‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల.. చివరికిలా..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

కలకలం.. ఏపీలో నలుగురికి కరోనా..!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా హైదరాబాద్‌కూ వచ్చేసింది. హైదరాబాద్‌‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

‘వకీల్ సాబ్’ ఈ బ్యూటీ పాత్రే హైలైట్!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 26వ చిత్రానికి ‘వ‌కీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను..

హైదరాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో స్కూల్స్‌కు సెలవు!

‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడీ తెలుగు రాష్ట్రాలకు పాకడంతో ఎప్పుడేం జరుగుతుందో అని జనాలు భయంతో వణికిపోతున్నారు.