Kantara Varaha Roopam Song : కాంతారా ‘‘వరాహరూపం’’ ఒరిజినల్ సాంగ్ వచ్చేసిందోచ్.. కానీ ఆ భాషల్లోనే
Send us your feedback to audioarticles@vaarta.com
కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో తన మార్కెట్ పరిధి మేరకే అక్కడ సినిమాలు తెరకెక్కేవి. అయితే బాహుబాలి, కేజీఎఫ్, పుష్ప ఘన విజయాలతో పాన్ ఇండియా స్థాయి సినిమాలపై ఫోకస్ పెట్టి సత్తా చాటుతోంది శాండిల్ వుడ్. ఈ క్రమంలో వచ్చిన సినిమా ‘‘కాంతారా’’. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కాంతారా.. కన్నడ సినిమాను మరో మెట్టు పైకెక్కించింది.
ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన ‘‘వరాహరూపం’’ సాంగ్:
థియేటర్లలో దుమ్మలేపిన కాంతారా ఇటీవల ఓటీటీల్లోనూ రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంతారాలోని ‘‘వరాహరూపం’’ సాంగ్ సినిమాకే హైలైట్. భూతకోలను ప్రదర్శించే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించే సమయంలో వచ్చే ఈ పాట ప్రేక్షకులను థియేటర్లలో మునివేళ్లతో నిలబడేలా చేస్తుంది. అంతేకాదు.. పతాక సన్నివేశాల్లో హీరో రిషబ్ శెట్టి నటనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఈ పాట రావడంతో ఆ సీన్స్ అద్భుతంగా పండాయి. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ‘‘వరాహరూపం’’ సాంగ్‌లో ఒరిజినల్ ట్యూన్ మారిపోయి ఉండటంతో నిరాశకు గురయ్యారు.
కాపీరైట్ పిటిషన్ కొట్టివేసిన కోర్ట్:
దీనికి కారణం లేకపోలేదు. తమ ట్యూన్‌ని కాపీ కొట్టారంటూ తెయ్యుకుడుం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ కేరళలోని కొజికోడ్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.... పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు, నిషేధాన్ని ఎత్తివేసింది. కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న కాంతారా టీమ్... అమెజాన్ ప్రైమ్‌లో ఒరిజినల్ సాంగ్ పెట్టింది. ప్రస్తుతానికి తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన కాంతారా సినిమాకి ఒరిజినల్ సాంగ్‌ను జత చేయగా... తెలుగు, కన్నడ భాషల్లోనే బ్యాలెన్స్ వుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com