'గౌతమిపుత్ర శాతకర్ణి' లో కన్నడ సూపర్ స్టార్ రాజ్ శివరాజ్ కుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాకు ఇప్పుడు మరో అదనపు ఆకర్ణణ తోడు కానుంది. అదే కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో ముఖ్యపాత్ర లోనటించడం. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు శివరాజ్‌కుమార్ ఓ కీలకపాత్రలో నటిస్తుండటంతో కన్నడ సినిమా పరిశ్రమలో కూడా `గౌతమిపుత్ర శాతకర్ణి` టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ``గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో కీలక పాత్రలో నటించడానికి అంగీకరించిన కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌గారికి థాంక్స్. స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ గౌతమిపుత్ర శాతకర్ణితో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం. ఇప్పటి వరకు రాజ్‌కుమార్ ఫ్యామిలీ సభ్యులు ఏ ఇతర భాషా చిత్రాల్లో నటించలేదు. శివరాజ్‌కుమార్ నటించే సన్నివేశాలను దర్శకుడు వచ్చే వారం చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్ని గౌతమిపుత్ర శాతకర్ణి రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో బిజినెస్‌ను పూర్తి చేసుకుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, హేమామాలిని, శ్రేయ, కబీర్ బేడి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంతన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com