Kiccha Sudeep:బీజేపీకి జై కొట్టిన కిచ్చా సుదీప్ .. వచ్చే ఎన్నికల్లో కమలానికి ప్రచారం, కర్ణాటకలో సమీకరణాలు మారుతాయా..?
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో సినీ తారలకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం వుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో తారలు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి పాల్గొనగా.. కొందరు మాత్రం బయటి నుంచి మద్ధతు ఇచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసి సక్సెస్ అయిన వారు కొందరే. ఇలాంటి వాతావరణం ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్, ఎమ్జీయార్, జయలలిత వంటి వెండితెర వేల్పులు ముఖ్యమంత్రులై చరిత్ర సృష్టించారు. వారి స్పూర్తితో ఎందరో రాజకీయాల్లోకి ప్రవేశించి తమ అదృష్టం పరీక్షించుకున్నారు.
కర్ణాటక ఎన్నికలకు మోగిన నగారా :
మరో ఏడాదిలో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంతకుమందే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం వుంది. ఇందులో తొలుత చెప్పుకోవాల్సింది దక్షిణాది రాష్ట్రం కర్ణాటక. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఏప్రిల్ 20.. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 24గా నిర్ణయించారు. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
శాండిల్‌వుడ్ నుంచి రాజకీయాల్లో సత్తా చాటిన స్టార్స్:
ఈ నేపథ్యంలో శాండిల్‌వుడ్ నుంచి కొందరు స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కన్నడ సీమ నుంచి గతంలోనే ఎందరో రాజకీయాల్లో సత్తా చాటారు. అంబరీష్, సుమలత, రమ్య, బీసీ పాటిల్, మాళవికా అవినాష్, అనంత్ నాగ్, ముఖ్యమంత్రి చంద్రు, జగ్గేష్, ఉమాశ్రీ, పూజా గాంధీ, శశికుమార్, తార, శృతీ, ప్రకాష్ రాజ్, ఉపేంద్ర తదితరులు పలు పార్టీల్లో చేరడమో లేదంటే సొంతంగా పార్టీలు పెట్టడమో చేశారు. తాజాగా ఈ దఫా కూడా పలువురు స్టార్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.
బీజేపీకి జైకొట్టిన కిచ్చా సుదీప్ :
ఇక కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి జై కొట్టారు. ఈ మేరకు ఆయన మరో స్టార్ హీరో దర్శన్‌తో కలిసి సీఎం బసవరాజ్ బొమ్మై సమక్షంలో బీజేపీలో చేరినట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారని కథనాలు వస్తున్నాయి. సుదీప్, దర్శన్‌లకు కన్నడ నాట మాస్ ఫాలోయింగ్ వుంది. వీరిద్దరికి కోట్లాది మంది అభిమానులు వున్నారు. వీరి చేరిక తమకు లాభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments